»   »  తమన్నా మరొకటి కమిటయ్యింది...ఫుల్ ఖుషీ

తమన్నా మరొకటి కమిటయ్యింది...ఫుల్ ఖుషీ

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : 'హిమ్మత్‌వాలా' రీమేక్ ఫ్లాప్ అవటంతో ఇక బాలీవుడ్ లో తమన్నా పని అయిపోయినట్లే అని అందరూ అంచనాలు వేసారు. దాంతో ఆమె దక్షిణాది సినిమాలపైనే దృష్టి కేంద్రీకరించింది. మళ్లీ 'హిమ్మత్‌వాలా' దర్శకుడు సాజిద్‌ఖాన్‌ నుంచే ఆమెకి పిలుపు వచ్చింది.

త్వరలో సైఫ్‌ అలీఖాన్‌ హీరో గా సాజిద్‌ ఓ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. ఇందులో సైఫ్‌ సరసన హీరోయిన్ గా తమన్నాని ఎంపిక చేసుకున్నారు. ఆమెతోపాటు ఈ చిత్రంలో మరో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు. ఆ పాత్రలకు ఇషా గుప్తా, సోనాల్‌ చౌహాన్‌లను ఎంచుకున్నారు.


అలాగే తమన్నా త్వరలో అక్షయ్‌కుమార్‌ సరసన ఓ హిందీ చిత్రం చేసే అవకాశం ఉందని సమాచారం. బాలీవుడ్ లో తన కెరీర్ ప్రారంభించిన తమన్నా అక్కడ క్లిక్ కాకుండా సౌత్ లో వర్కవుట్ అయ్యింది. అయినా అక్కడ మోజు తీరలేదు. 'హిమ్మత్‌వాలా' సినిమాలో నటించేటప్పుడు హిందీ చిత్రసీమలో విజయం సాధించాలని...తమన్నా ఎన్నో ఆశలుపెట్టుకొంది... కానీ ఆ చిత్రం బాక్సాఫీసు దగ్గర నిలబడలేకపోయింది. అయితే లక్కీగా ఈ ఆఫర్ రావటంతో ఆమె చాలా హ్యాపీగా ఉంది.

English summary

 Tammannah moved to Bollywood and was paired opposite Ajay Devgan in Sajid Khan's film Himmatwala. The film flopped miserably. But this flop hasn't deterred director Sajid Khan from casting Tamannah again in his films. She has been paired opposite Saif Ali Khan in Sajid Khan's next film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu