For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  క్యూట్ తమన్నా...హాట్ హాట్ గా...(ఫోటో ఫీచర్)

  By Srikanya
  |

  హైదరాబాద్ : మిల్కీ బ్యూటీ తమన్నా ఇటు తెలుగు అటు తమిళ భాషల్లో 'మోస్ట్ వాంటెడ్' హీరోయిన్‌గా మారిపోయింది. ఈ పాల బుగ్గల సుందరికి తమిళనాడులో గుడి కట్టినంత పని చేశారు కొంతమంది ఫ్యాన్స్ . అందుకే తనకు 'హ్యాపీడేస్' రూపంలో బ్రేక్ ఇచ్చిన టాలీవుడ్‌ని ఇష్టపడినట్లుగానే కోలీవుడ్‌ని కూడా ఇష్టపడతారు తమన్నా.తాజాగా విజయ ప్రొడక్షన్ పతాకంపై బి.నాగిరెడ్డి ఆశీస్సులతో బి.వెంకటరామిరెడ్డి సమర్పణలో భారతి రెడ్డి నిర్మిస్తున్న భారీ చిత్రంలో తమన్నాను హీరోయిన్ గా ఎంపిక చేసారు. ఈ చిత్రంలో అజిత్ హీరోగా నటించనున్నారు. ఈ చిత్రానికి రవితేజతో దరువు చేసిన శివ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం ఆదివారం దేవిశ్రీప్రసాద్ స్టూడియోలో ప్రారంభమైంది. అంత పెద్ద బ్యానర్ లో ఆఫర్ సంపాదించటం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపధ్యంలో ఆమె మీడియాతో మాట్లాడిన మాటలు మీకోసం..

  తమన్నాకు మొదటనుంచీ బాలీవుడ్ ఆఫర్స్ మీదే ఆసక్తి ఉంది. అయితే అవి కలిసిరాకపోవటమే కాక కోర్టు కేసులతో వివాదంలో సైతం ఆమెను దింపాయి. ఆమె తొలి బాలీవుడ్ చిత్రం ఆమెకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. దాంతో సౌత్ మీద ఆమె దృష్టి పెట్టి ఇక్కడ పెద్ద హీరోలందరితో చేసింది. ఇప్పుడు హిమ్మత్ వాలాతో మళ్లీ బాలీవుడ్ బరిలోకి దూకుతోంది.

  లక్‌ అనేది ఎక్కడినుంచో రాదనీ, మన ఆలోచనల్లో, ఆచరణలో ఉంటుందనీ నమ్ముతా. వందశాతం పనిచేసి విజయాన్ని భగవంతుడికి వదిలేయడం నా ఫిలాసఫీ. అందుకే అవార్డుల గురించి కాకుండా నాకు ఇచ్చిన పాత్రలో వందశాతం కష్టపడ్డానా లేదా అన్న దానిపైనే దృష్టిపెడతా. దటీజ్‌ తమన్నా అని అనిపించుకోవాలనుకుంటా.

  నేను పుట్టిపెరిగింది ముంబయిలో. నాన్న సంతోష్‌ భాటియా. అమ్మ రజని. అన్నయ్య ఆనంద్‌. పదో తరగతి వరకు జుహూలోనే చదువుకొన్నా. ముందునుంచీ సినిమాలంటే చెప్పలేనంత ఇష్టం. టీవీలో వచ్చిన సినిమాలు చూడటం, అందులో హీరోయిన్లలా తయారై రోజంతా ఆ పాత్రలో నన్ను నేను వూహించుకోవడం, అదే పేరు పెట్టుకోవడం తప్ప మరో ధ్యాస ఉండేది కాదు. ఇంట్లో అమ్మను కూడా అలాగే పిలవమని చెప్పేదాన్ని.

  ఓసారి మా స్కూల్‌ యాన్యువల్‌ డే ఫంక్షన్‌లో పాల్గొన్న నన్ను చూసి ఓ దర్శకుడు 'నటిస్తావా' అని అడిగారు. అలా పదమూడేళ్ల వయసులోనే ఫెయిర్‌ అండ్‌ లవ్లీ ప్రకటనలో కనిపించా. ఆ తరవాత హిందీ సినిమా 'చాంద్‌సా రోషన్‌ చెహ్రా'లో చేశా. అదే ఏడాది తెలుగులో 'శ్రీ'లోనూ అవకాశం వచ్చింది. ఆ తరవాత తమిళంలో మూడు సినిమాలు చేశాక 'హ్యాపీడేస్‌'తో మళ్లీ తెలుగులోకి వచ్చా. ఆ సినిమా తరవాత చెప్పేదేముంది... వరుస అవకాశాలతో అటు తమిళం, ఇటు తెలుగులో బిజీ బిజీ.

  నేను చేసిన వాటిలో బాగా నచ్చిన పాత్రంటే 100% లవ్‌లో మహాలక్ష్మే. అందులోలానే చికెన్‌ అంటే పడి చస్తా. బద్రినాథ్‌లో నా డ్యాన్స్‌ చూసి అల్లుఅర్జున్‌ మెచ్చుకోవడం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. 'కెమెరామెన్‌ గంగతో రాంబాబు' చేస్తున్నప్పుడు విలేకరి ఇంత కష్టపడతాడా అనిపించింది.

  నాకు ఇష్టమైన సినిమాలు: దిల్‌వాలే దుల్హనియా లేజాయింగే, మొఘల్‌ ఏ ఆజం. ఈ రెండూ ఎన్నిసార్లు చూశానో చెప్పక్కర్లేదు. తెలుగులో అయితే ఆనంద్‌.నచ్చిన హీరోయిన్స్ ...మాధురీదీక్షిత్‌, ప్రీతీజింతా

  ఈ రంగంలోకి వచ్చేముందే నాకంటూ కొన్ని నియమాలు పెట్టుకున్నా. నాకు ఇబ్బందికరంగా అనిపించే సన్నివేశాల్లో నటించనని ముందే చెప్పేస్తా. అలాగే ఒకేసారి ఐదారుసినిమాలు ఒప్పుకుని చేయలేక నేను కంగారుపడి, దర్శకులను ఇబ్బందిపెట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే ఒకసారి రెండు సినిమాలకు మాత్రమే సంతకం చేస్తా. అవి పూర్తయ్యాకే కొత్తవి ఎంచుకుంటా తప్ప తొందరపడను.

  నేను పురస్కారాలకు ప్రాధాన్యం ఇస్తాను కానీ వాటి కోసమే సినిమాలు చేయను. నా ప్రతిభకు పురస్కారం వస్తే దాన్ని బోనస్‌గానే భావిస్తా. ఈ మధ్య నయన్‌కు 'శ్రీరామరాజ్యం'లో ఉత్తమ నటిగా నంది అవార్డు వచ్చినందుకు చాలా ఆనందించా. సీతగా తన నటన అద్భుతం. మేమిద్దరం మంచి స్నేహితులం కూడా.

  అవకాశం వస్తే చంద్రముఖి లాంటి పాత్ర చేయాలని ఉంది.ఇష్టమైన ఐటెం సాంగ్‌ ఐశ్వర్యారాయ్‌ నటించిన కజరారే పాట.

  English summary
  
 Tamanna is one heroine who has made up to the success ladder with her sheer dedication and hard work. She is happy that her friend Nayanatara has won the Nandi Award for her role in SRR. "I do not act for the sake of awards. I have been called a good actress. I am very happy. I am happy for Nayanatara also.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X