»   » అసలు అదే కానీ...: తమన్నా పాత్ర లెస్బియన్

అసలు అదే కానీ...: తమన్నా పాత్ర లెస్బియన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :రీమేక్ లు చేసినప్పుడు మన నేటివిటికి మార్చుకోవటం సాధారణంగా జరిగే పనే. అలాగే ప్రెంచ్ చిత్రం అన్ టచ్ బుల్స్ కు రీమేక్ గా వస్తున్న ఊపిరి చిత్రంలోనూ తమన్నా పాత్ర ను పూర్తి స్దాయి మార్పులు చేసారని తెలుస్తోంది. ఒరిజనల్ లో ఆ పాత్ర ఓ లెస్బియన్ పాత్ర అని సమాచారం.

అయితే తెలుగు సెన్సిబులిటీస్ కు అణుగుణంగా మార్చారని చెప్తున్నారు. బాహుబలి తర్వాత వస్తున్న తమన్నా సినిమా ఊపిరి. ఈ సినిమాపై ఆమె చాలా నమ్మకాలు పెట్టుకుంది. నాగార్జున, కార్తీ హీరోలుగా నటించిన ఈ సినిమాలో తమన్న పాత్ర పేరు కీర్తి. ఆమె మిలియనీర్ అయిన నాగార్జునకు పర్సనల్ అసిస్టెంట్ గా కనపించబోతోంది.


Tamanna supposed to play as a lesbian

ఇందులో నాగార్డున పాత్ర పేరు విక్రమాదిత్య, ఓ బిలియనీర్‌గా కనిపిస్తాడు. అతని కాళ్లు, చేతులు ఎలా పోయాయన్నది చూపించరు. అన్నీ వున్నా ఏదో తెలియని వెలితి అతన్ని వెంటాడుతుంటుంది. అలాంటి వ్యక్తికి శీను పరిచయమవుతాడు. శీను స్లమ్ నుంచి వచ్చిన యువకుడు. ఆ పాత్రలో కార్తీ ఒదిగిపోయాడు.


తమన్నా ఈ సినిమాలో సోంతంగానే డబ్బింగ్ చెప్పుకుంది, ఈ మధ్య తన పాత్రకు సంబందించిన డబ్బింగ్ పార్ట్ కూడా పూర్తిచేసుకుంది. పి.వి.పి. సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా హిట్ అయితే సీక్విల్ తీయాడానికి కూడా సిద్దంగా వున్నారని నిర్మాతలు ఆల్రెడీ ప్రకటించారు.

English summary
‘Oopiri’ is the re-make of French Film, ‘The Untouchables’. In the Original, Tamannah's character is that of a Lesbian.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu