»   » ఎంతో అవమానం ఫీలయ్యి నిర్ణయించుకున్నా...తమన్నా

ఎంతో అవమానం ఫీలయ్యి నిర్ణయించుకున్నా...తమన్నా

Posted By:
Subscribe to Filmibeat Telugu

అది ఎంతో అవమానంగా అనిపించేది. ఆ క్షణమే నిర్ణయించుకున్నాను. ఎలాగైనా తెలుగు నేర్చు కోవాలని పట్టుదలతో కృషి చేసాను. తెలుగులో మాట్లాడుతున్న వారిని గమనించి కొద్ది కొద్దిగా నేర్చుకున్నాను అంటోంది తమన్నా. గతంలో వచ్చీ రాని తెలుగు భాషలో మాట్లాడే ఈ భామ ఇప్పుడు తెలుగులో ఎవరితోనైనా అనర్గళంగా, ఎటువంటి సంశయం లేకుండా మాట్లాడగలుగు తోంది. దానికి కారణం వివరిస్తూ ఇలా చెప్పుకొచ్చింది. నటిగా సక్సెస్ అయినా భాషా పరగంగా చాలా ఇబ్బందులు పడ్డాను అంటోంది. మొదటి సినిమా 'శ్రీ' చేస్తున్నప్పుడు భాష రాక చాలా అవస్థ పడేదాన్ని. సెట్‌లో అందరూ హాయిగా మాట్లాడుకుంటుంటే నేనొక్కదాన్నే మూగదానిలా కూర్చునేదాన్ని. అది అవమానంగా ఫీలయ్యా.

అదే నన్ను తెలుగు భాష నేర్చుకునేలా ప్రేరేపించింది. కొంతకాలం తర్వాత నా మేకప్‌మన్‌ చక్రవర్తితో తెలుగులో మాట్లాడటం మొదలుపెట్టాను. ఏమైనా తప్పులు దొర్లితే ఆయనే సరిచేసేవారు. అలా అలా అతని సహాయంతో తెలుగు మాట్లాడ్డం వచ్చేసింది. ఇప్పుడు తెలుగులో ఎటువంటి సందేహం లేకుండా బాగా మాట్లాడతాను. తెలుగే కాదు...తమిళ్‌ కూడా అంతే. త్వరలోనే రెండు భాషల్లోనూ నా పాత్రకు నేనే డబ్బింగ్‌ చెబుతాను కూడా అంటూ చెప్పుకొచ్చింది తమన్నా. ప్రస్తుతం తమన్నా...నాగచైతన్య సరసన సుకుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తోంది. అలాగే అల్లు అర్జున్ తో వివి వినాయిక్ దర్శకత్వంలో రూపొందే బద్రీనాధ్ ని కమిటైంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu