యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని సంతృప్తి పరచలేదంటోంది...!?
ప్రస్తుతం టాలీవుడ్ లో తమన్నా, సమంత పోటాపోటీగా సినిమాలు చేస్తున్నారు. సినిమాలైతే పోటీగా చేయొచ్చుగానీ, మీడియావారికి, జనాలకు తమన్నాయే దగ్గరగా ఉందని పరిశీలకులు అంటున్నారు. దానికి కారణం తమన్నా మీడియాకి దగ్గరగా ఉండటమే. ఇంటర్వ్యూల ద్వారా తమన్నా జనాలకు దగ్గరవుతోంది. అది ఆమెకు ప్లస్ అవుతోంది. వెండితెర అరంగేట్రం చేసిన అనతి కాలంలోనే టాప్ హీరోల సరసన ఛాన్సులు కొట్టేసిన మిల్కీ బ్యూటీ తమన్నా ఇంటర్వ్యూలలో.. హీరోల సంగతులును తెగ చెప్పేస్తోంది.
తాను కలిసి నటించిన హీరోల గురించి కథలు చెపుతోంది..తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కొత్త చిత్రం 'ఊసరవెల్లి'లో ఈ మిల్క్ బ్యూటి తమన్నా జంటగా నటించింది. ఈ చిత్రంలో ఆమె నటనను చూసిన ప్రతి ఒక్కరూ హ్యాట్సాఫ్ అంటున్నారట. అయితే చిత్ర హీరో జూనియర్ ఎన్టీఆర్ ను సంతృప్తి పరచడం నావల్ల కాలేదని తేల్చిచెప్పింది. సంతృప్తి అంటే... మరేంటో అనుకునేరు...
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటేనే డాన్స్ ఇరగదీస్తాడని పేరుంది. ఆయనతో పోటీపడి డాన్స్ చేశాను. కానీ రెండో పాటకు చేయలేక పోయానని అంటోంది. నేనే కాదు.. ఏ హీరోయిన్ అయినా ఆయనను డాన్సుల్లో బీట్ చేయడం కష్టమని బల్లగుద్ది వాదిస్తోంది. మరి జూనియర్ అంతగా భయపెట్టాడు కాబోలు. అంతేకాదండోయ్..గతంలో హ్యాపీడేస్ చిత్రం గతంలో హ్యాపీడేస్ చిత్రంలో తమన్నానటన చూసి దర్శకరత్న దాసరి నారాయణరావే ఆశ్చర్య పోయిన విషయం తెలిసిందే. ఈమెకు మంచి భవిష్యత్ ఉందని ఆనాడే చెప్పారు. అల్లు అరవింద్ అయితే 100%లవ్ లో బ్రహ్మాండంగా ఏక్ట్ చేసిందని చెప్పాడు. బడా నిర్మాతల చేత శభాష్ అనిపించుకున్న ఈ మిల్క్ బ్యూటీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను సంతృప్తి పరచలేకపోయానని తెగ ఫీలైపోతోంది.


Click it and Unblock the Notifications











