»   » టాలీవుడ్ హీరోయిన్స్ పై మోజు పడుతున్న బాలీవుడ్ హీరోలు...!

టాలీవుడ్ హీరోయిన్స్ పై మోజు పడుతున్న బాలీవుడ్ హీరోలు...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ లో నిర్మితమవుతున్న సినిమాల్లో ఇప్పడు తెలుగు నుంచి రీమేక్ అవుతున్నవే ఎక్కువ. రీమేక్ సినిమాలతో సూపర్ హిట్ లు కొడుతూ వాటిపై మరింత మోజు పెంచుకున్న బాలీవుడ్ హీరోలు సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవ్ గన్ లు ఇప్పుడు సౌత్ హీరోయిన్లు కావాలని పట్టుపడుతున్నారు. తెలుగులో సూపర్ హిట్ అయిన విక్రమార్కుడు హిందీ రీమేక్ అక్షయ్ కుమార్ చేస్తున్నాడు. అందులో అనుష్క కావాలని పట్టుబట్టిన అక్షయ్ కి అనుష్క నో చెప్పేసింది. ఇప్పుడు రాజమౌళి డైరెక్షన్ లో మరో సూపర్ హిట్ 'మర్యాద రామన్న" హిందీ రీమేక్ లో నటిస్తున్న అజయ్ దేవ్ గన్ తమన్నా హీరోయిన్ గా కావాలంటూ పట్టు పట్టారట. ఈ చిత్రానికి అశ్విన్ దీర్ దీనికి దర్శకత్వం వహిస్తాడని తెలుస్తోంది. మర్యాద రామన్న రీమేక్ హక్కుల్ని పెద్ద మొత్తం వెచ్చించి తీసుకున్నారట.

ప్రస్తుతం తెలుగులో బిజీగా వున్న తమన్నా కూడా, కాజల్ బాటలో బాలీవుడ్ కి వెళుతోందా? దీనికి అవుననే సమాధానం వస్తోంది. అందుకు సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. ఓ తెలుగు హిట్ సినిమా రీమేక్ ద్వారా ఆమె బాలీవుడ్ ప్రవేశం చేస్తోంది. ఆమధ్య హాస్యనటుడు సునీల్ ని కథానాయకుడిగా పెట్టి రాజమౌళి రూపొందించిన 'మర్యాదరామన్న" చిత్రాన్ని హిందీలోకి రీమేక్ చేయడానికి ప్లాన్ జరుగుతోంది. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుందని సమాచారం. అదే గనుక నిజమైతే బాలీవుడ్ కి వెళ్ళిన హీరోయిన్ ల లిస్ట్ లో తమన్నా కూడా చేరుతుంది.

English summary
Now the latest news is that Milky beauty Tamanna is all set to sizzle the Bollywood silver screen. It is known news to all that bollywood film makers are planning to remake telugu movie Maryada Ramanna in Hindi. Ajay Devgan is playing the main lead role of Sunil in Hindi version.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu