»   » ఎన్టీఆర్‌తో రిలేషన్ స్పెషల్.. అది సమస్యే కాదు.. తమన్నా

ఎన్టీఆర్‌తో రిలేషన్ స్పెషల్.. అది సమస్యే కాదు.. తమన్నా

Posted By:
Subscribe to Filmibeat Telugu

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మిల్క్ బ్యూటీ తమన్నా కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ఊసరవెల్లి. ఈ చిత్రంతో వారు హిట్ పెయిర్ గా టాలీవుడ్ లో ముద్ర పడింది. అయితే తాజాగా ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న చిత్రం జైలవకుశ. ఈ చిత్రంలో తమన్నా ఓ పాటలో తళుక్కున మెరవనుంది. అందుకోసం ఆమె చిత్ర నిర్మాతల నుంచి భారీగా నజరాన అందుకున్నట్లు టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో వార్తలు షికార్లు చేస్తున్నా. కాగా సాంగ్ కోసం ఎంత తీసుకున్నారు మేడమ్ అంటే మాత్రం ఆ ఒక్కటి తప్ప అంటూ మాటలు దాటవేస్తున్నది. కావాలంటే ఆమె మాట్లాడిన మాటలే చూడండి...

అది ట్రీట్ లాంటింది...

అది ట్రీట్ లాంటింది...

'కొన్ని రిలేషన్స్ డబ్బు కంటే ఎక్కువ. ఎన్టీఆర్ తో డ్యాన్స్ చేయడం అంటే అది ట్రీట్ లాంటిది. కాబట్టి ఆ పాటకు ఎంత డబ్బు వస్తుందనే విషయం గురించి నేను అసలు పట్టించుకోను. మంచి సినిమాలు చేయడంతో పాటు క్రేజీగా డిజైన్ చేస్తే ఐటమ్ సాంగ్స్ చేస్తాను' అని స్పష్టం చేసింది తమన్నా. సో... ఎన్టీఆర్ తో ఐటమ్ సాంగ్ కాబట్టి అలా నిర్మాతలు అడగడం... అందుకు తమన్నా మరో ఆలోచనకు తావివ్వకుండా ఓకే చేసి ఉంటుందని తెలుస్తోంది.


"Jai Lava Kusa" Censor Reports ‘జై లవ కుశ’ సెన్సార్ రిపోర్ట్..
స్వింగ్ జరా...

స్వింగ్ జరా...

'జై లవ కుశ' చిత్రంలో మిల్క్ బ్యూటీ తమన్నా'స్వింగ్ జరా...' అంటూ ఐటమ్ సాంగ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఐటమ్ పాటకు తమన్నా భారీగా డిమాండ్ చేసి పారితోషికం తీసుకుని ఉంటుందని సమాచారం. ఎందుకంటే నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ 'అల్లుడు శీను' చిత్రంలోని ఐటమ్ సాంగ్ చేసినందుకు తమన్నా రూ. 60 లక్షలు పారితోషికం తీసుకుందనే వార్తలు గుప్పుమన్నాయి. అలాంటింది యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోసం అది ఐటమ్ సాంగ్ పాటకి కూడా ఈ అమ్మడు భారీగానే సొమ్ము దండుకుని ఉంటుందని అంచనా. దీనిపై స్పందించమని కొరితే మాత్రం ఆ అందాల అమ్మడు పైవిధంగా స్పందించింది. ఇక ఐటెం సాంగ్ విషయానికి వస్తే...


పుట్టుకతోనే నేను...

పుట్టుకతోనే నేను...

ఈ చిత్రంలోని ‘స్వింగ్‌ జరా..' అనే ప్రత్యేక గీతాన్ని(ఆడియో) శనివారం విడుదల చేశారు. ఎన్టీఆర్‌-తమన్నాలపై చిత్రీకరించారు. ఈ పాటలోని ‘పుట్టుకతోనే నేను ఓ నిప్పుతో పుట్టాను.. అడిగాడో సూర్యడికే అ..అ..అప్పిస్తాను' అనే చరణం ఎంతో పవర్ ఫుల్ గా ఉందని ఆయన అభిమానులు అంటున్నారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా, నేహా బాసిన్, దేవిశ్రీ ప్రసాద్‌ ఆలపించారు.


యూట్యూబ్‌లో ట్రెండింగ్

అయితే శుక్రవారం ఈ పాట ప్రోమోను విడుదల చేశారు. ఇందులో ఎన్టీఆర్‌, తమన్నా తమదైన శైలిలో స్టెప్పులేసి అదరగొట్టారు. ఈ ప్రోమో అభిమానుల్ని తెగ ఆకట్టుకుంది. యూట్యూబ్‌లో విడుదలైన 20 గంటల్లో ఈ వీడియోను 15 లక్షల మంది వీక్షించారు. అంతేకాదు ప్రస్తుతం యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో ప్రథమ స్థానంలో నిలిచింది.


చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్‌ ...

చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్‌ ...

రాశీఖన్నా, నివేదా థామస్‌ ‘జై లవకుశ'లో కథానాయికలుగా నటించారు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై కల్యాణ్‌రామ్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. సెప్టెంబరు 21న చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.English summary
Tamannaah Bhatia again shakes the leg for Item song in Jai Lava Kusa. This time moves steps with Jr NTR. Reports suggest that she gets huge remunaration for the Item Song Swing Jara. In this occasion, Tamannaah said, I have special relation with NTR.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu