»   » సోదరుడి పెళ్లిలో తమన్నా హంగామా.. ఇంటర్నెట్‌లో ఫోటోలు వైరల్.. (గ్యాలరీ)

సోదరుడి పెళ్లిలో తమన్నా హంగామా.. ఇంటర్నెట్‌లో ఫోటోలు వైరల్.. (గ్యాలరీ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

పెళ్లంటే నూరేళ్ల పంట అన్నట్టే .. తమన్నా తన సోదరుడి వివాహా వేడుకను ఘనంగా నిర్వహించింది. తన సోదరుడు ఆనంద భాటియా వివాహం కోసం భారీగా ఏర్పాట్లు చేశారు. పెళ్లి వేడుకలో భాగంగా ఏర్పాటు చేసిన సంగీత్ కార్యక్రమం సందడి సందడిగా సాగింది. వివాహ వేడుక కార్యక్రమంలో సంప్రదాయ దస్తులు ధరించి అతిథులను ఆకట్టుకొన్నది. ఈ వేడుకకు సంబంధించి ఫొటోలు ఇంటర్నెట్‌లో హల్చల్ చేస్తున్నాయి.

సోదరుడి పెళ్లిలో తమన్నా హంగామా

సోదరుడి పెళ్లిలో తమన్నా హంగామా

తమన్నా సోదరుడు ఆనంద్ భాటియా అమెరికాలో డాక్టర్. భారతీయ సంప్రదాయ పద్ధతిలో కృతికా చౌదరీతో వివాహం జరిగింది. ఈ వివాహా వేడుకలో భాగంగా సంగీత్, మెహందీ తదితర కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను తమన్నా షేర్ చేశారు.

పలు రకాలుగా డిజైనర్ దస్తులు

పలు రకాలుగా డిజైనర్ దస్తులు

సోదరుడి వివాహా వేడుకలో తమన్నా ధరించిన దుస్తులు ప్రత్యేక ఆకర్షణ మారాయి. పసుపు పచ్చని షరారాపై ఆకుపచ్చని ఎంబ్రాడయిరీ దుపట్టాను ఆమె ధరించారు. ఈ డ్రస్‌ను పంజాబీ కపూర్ అనే డిజైనర్ డిజైన్ చేసింది.

నీతా లూల్లా డిజైన్ చేసిన ..

నీతా లూల్లా డిజైన్ చేసిన ..

ఈ వేడుకలో పలు రకాల లహెంగాలు ధరించింది. కొన్ని దుస్తులను నీతా లుల్లా డిజైన్చేశారు. గెహానా జ్యువెల్లరీ నుంచి కొనుగోలు చేసిన డైమండ్ నెక్లెస్‌ను మెహందీ ఫంక్షన్‌లో ధరించింది.

సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన తమన్నా

సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన తమన్నా

సంగీత్ కార్యక్రమంలో సంప్రదాయ దస్తులు ధరించి అతిథులను ఆకట్టుకొన్నది. సంగీత్ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఖుషీ ఖుషీగా డ్యాన్సులతో..

ఖుషీ ఖుషీగా డ్యాన్సులతో..

సంగీత్ వేడుకలో డ్యాన్సులతో తమన్నాఅలరించింది. ఈ వేడుకలో అతిథులను, బంధువులకు ఆహ్వానం పలుకుతూ ఖుషీ ఖుషీగా కనిపించింది.

ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో..

ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో..

సోదరుడి వివాహా వేడుక గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్‌డేట్ చేసింది. సంతోషంలో తడిసి ముద్దయ్యాను. అద్భుతమైన డిజైనర్ దస్తులను ధరించాను అని ఇన్స్‌టాగ్రామ్‌లో పేర్కొన్నది.

సోదరుడి

సోదరుడి

సోదరుడి ఆనంద్ భాటియా పెళ్లికి కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, మిత్రులు మాత్రమే హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తన స్నేహితులతో చాలా హ్యాపీగా గడిపానని తమన్నా పేర్కొన్నది.

 ప్రభుదేవా సరసన తమన్నా..

ప్రభుదేవా సరసన తమన్నా..

ప్రస్తుతం ప్రభుదేవా సరసన ఖామోషీ అనే చిత్రంలో తమన్నా నటిస్తున్నది. ఈ చిత్రంలో మూగ, చెవిటి అమ్మాయిగా కనిపించనున్నది.

జాన్ అబ్రహానికి షాకిచ్చిన అవంతిక

జాన్ అబ్రహానికి షాకిచ్చిన అవంతిక

ఇటీవల ఓ బాలీవుడ్ చిత్రం నుంచి తమన్నా తప్పుకొన్నదని ఓ రూమర్ ప్రచారంలో ఉంది. జాన్ అబ్రహం సరసన తమన్నా చోర్ నిక్లే కే భాగా అనే చిత్రంలో నటిస్తుందనే వార్తలు వచ్చాయి. కొన్ని కారణాల వల్ల ఆమె ఆ చిత్రం నుంచి తప్పుకున్నట్టు సమాచారం.

 విశాల్, విక్రమ్ సరసన..

విశాల్, విక్రమ్ సరసన..

అలాగే త‌మిళంలో విక్ర‌మ్ స‌ర‌స‌న స్కెచ్ సినిమా చేస్తూనే మ‌రో వైపు విష్ణు విశాల్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కుతున్న పాన్ ఒండ్రు కందియెన్ అనే సినిమాలో న‌టిస్తున్నది.

English summary
Tamannaah Bhatia who tasted year’s biggest success with Baahubali 2, recently was seen dressed in gorgeous traditional style during her brother’s wedding. Yes, taking a break from her work commitments, we spotted Ms. Bhatia having a great time with family and friends.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu