»   » మళ్లీ ఆ హీరోతో మిల్కి బ్యూటీ.. అనుష్క లేకపోతే నా పరిస్థితి ఏంటో.. తమన్నా..

మళ్లీ ఆ హీరోతో మిల్కి బ్యూటీ.. అనుష్క లేకపోతే నా పరిస్థితి ఏంటో.. తమన్నా..

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలి తర్వాత మిల్కి బ్యూటీ తమన్నా భాటియా బాలీవుడ్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. హిందీ చిత్ర పరిశ్రమలో ఓ విభిన్నమైన పాత్ర ఆమెను వెతుక్కుంటూ వచ్చింది. బాహుబలి2 తర్వాత హిందీలో వశు భగ్నానీ నిర్మించే చిత్రంలో మూగ, చెవిటి అమ్మాయిగా నటించనున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. బాహుబలి2 చిత్ర విశేషాలను, తన జీవితంలోని కొన్ని విషయాలను వివరించింది.

విభిన్నమైన పాత్రల్లో కనిపించాలని..

విభిన్నమైన పాత్రల్లో కనిపించాలని..

బాహుబలి తర్వాత ప్రేక్షకులు విభిన్నమైన పాత్రలో నన్ను చూడాలని కోరుకొంటున్నారు. ఆ విషయం బాహుబలి తర్వాతే అర్థమైంది. వశు భగ్నానీ తీసే సినిమాలో మూగ చెవిటి అమ్మాయిగా నటిస్తున్నాను. మేకప్ విషయంలో మీరు గుర్తు పట్టనంత డిఫరెంట్‌గా ఉంటుంది అని తమన్నా తెలిపింది.

ప్రభుదేవాతో కలిసి..

ప్రభుదేవాతో కలిసి..

ప్రభుదేవాతో కలిసి మరో చిత్రంలో నటిస్తున్నాను. ఇది కూడా డిఫెరెంట్ చిత్రం. కథ, కథనం ప్రేక్షకులకు విపరీతంగా నచ్చుతుంది. తూతక్ తూతక్ టూటియా అనే చిత్రం కనిపించిన పాత్ర కంటే భిన్నమైనది అని తమన్నా తెలిపింది. ఆ చిత్రంలో ప్రభుదేవా, సోనుసూద్‌తో కలిసి నటించిన సంగతి తెలిసిందే.

హాలీవుడ్ స్థాయికి తగినట్టుగా..

హాలీవుడ్ స్థాయికి తగినట్టుగా..

గతంలో భారతీయ ప్రేక్షకులు సూపర్‌మ్యాన్, స్పైడర్ మ్యాన్ లాంటి హాలీవుడ్ చిత్రాల కోసం ఎగబడే వారు. ప్రస్తుతం దేశీయ ప్రేక్షకులకు బాహుబలి ఇండియన్ సూపర్ హీరో. బాహుబలి సినిమా ప్రేక్షకులకు హాలీవుడ్ స్థాయి అనుభూతిని కలిగించింది. రెండేళ్లలోపే బాహుబలి రీరిలీజ్ కావడం అనే విషయం గర్వించతగినదే. బాహుబలిని రెండు పార్టులుగా ఆదరించడం లాంటి అంశం ప్రేక్షకుల్లో గణనీయమైన మార్పు తెచ్చిందని చెప్పడానికి అవకాశం కలిగింది.

అనుష్క లేకపోతే నేను..

అనుష్క లేకపోతే నేను..

అనుష్కతో ఉన్న అనుబంధంపై తమన్నా వ్యాఖ్యానిస్తూ నేను పరిశ్రమలోకి ప్రవేశించినప్పటి నుంచి ఆమెతో పరిచయం ఉంది. నా కెరీర్ మొదట్లో నాకు సహకరించిన వారిలో అనుష్క ఒకరు. ఐదేళ్లపాటు ఆమె అగ్ర హీరోయిన్‌గా వెలుగొందింది. అంతటి అనుభవం, టాలెంట్ ఉన్న అనుష్కతో నటించడం చాలా సంతోషంగా ఉంది. బాహుబలిలో తొలిసారి యుద్ధ విన్యాసాలు చేశాను. నా ఎత్తు నాకు మైనస్ అనే భావనలో ఉండేదానిని. కానీ అదే నాకు బాహుబలిలో ప్లస్ అయింది.

ఏప్రిల్ 28న ..

ఏప్రిల్ 28న ..

దర్శకుడు రాజమౌళి డైరెక్షన్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరెక్కిక్కిన బాహుబలి ది కన్‌క్లూజన్ ఏప్రిల్ 28న విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ చిత్రంలో ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్కశెట్టి, తమన్నా, రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

English summary
Actress Tamannaah Bhatia, who is all geared up for the release of her upcoming magnum-opus Baahubali 2, revealed that her next is with Vashu Bhagnani where she plays a deaf and dumb's character.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu