»   » తమన్నా దంచి కొట్టిందిగా.. ఆపండి ఆ వేషాలు.. దిమ్మ తిరిగేలా క్లాస్ పీకింది!

తమన్నా దంచి కొట్టిందిగా.. ఆపండి ఆ వేషాలు.. దిమ్మ తిరిగేలా క్లాస్ పీకింది!

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినీ ప్రముఖులపై కొన్నిసార్లు రేటింగ్ పెంచుకోవడానికి ఉన్నది లేనట్టుగా రాస్తుంటారు. అలాంటి సందర్భాల్లో తారలు అప్పుడప్పుడు తమ ఆవేదనను వ్యక్తం చేస్తుంటారు. తాజాగా అలాంటి పరిస్థితే మిల్కీ బ్యూటీ తమన్నా భాటియాకు ఎదురైంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తాను చెప్పిన విషయాన్ని మరోలా రాసినందుకు అగ్గిమీద గుగ్గిలయ్యారు తమన్నా.. ఇంతకీ ఏమి జరిగిందంటే..

Tamanna Special Song In 'Jai Lava Kusa' తమన్నా స్పెషల్ సాంగ్ ప్రోమో ఇదే..
 తప్పుడు రీతిలో రాయొద్దు

తప్పుడు రీతిలో రాయొద్దు

నేను చెప్పింది కాకుండా నాపై ఏదో తప్పుడు రీతిలో రాశారు. అది నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. ఏ వార్తనైనా ప్రచురించే ముందు ముందు వెనుక ఎందుకు ఆలోచించరు. సినీ తారలైనా ఇంకొకరైనా ఇబ్బందికి గురవుతారని ఎందుకు అనుకోరు అని తమన్నా ఆవేదన వ్యక్తం చేసింది.

 టీఆర్పీ కోసమే..

టీఆర్పీ కోసమే..

మీ టీఆర్పీ కోసమో.. సెన్సేషనలైజ్ చేయడానికో ఎందుకు ప్రయత్నిస్తారో నాకు అర్థం కాదు. మరోసారి నా గురించి ఏదైనా పబ్లిష్ చేస్తే నాకు ఇమేజ్‌కు ఇబ్బంది కలుగుకుండా చూసుకోవాలి. ఏదైనా సందేహం ఉంటే నన్ను అడిగి రాసుకోవాలి అని తమన్నా చెప్పారు.

వక్రీకరించి రాయొద్దు..

వక్రీకరించి రాయొద్దు..

ఇంటర్వ్యూ పేరుతో నేను చెప్పని విషయాలను వక్రీకరించి రాయకూడదు. టీఆర్పీల కోసం పాకులాడవద్దు. మీ ఎల్లో జర్నలిజాన్ని దయచేసి ఆపండి అని తమన్నా రిక్వెస్ట్ చేసింది. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితంలోని కొన్ని సమస్యలను పంచుకొనేందుకు ప్రయత్నం చేసింది.

 జీవితాలు అలా ఉండవు

జీవితాలు అలా ఉండవు

సినీ తారల జీవితాలు చాలా టెన్షన్‌తో కూడుకొని ఉంటాయి. మానసికంగా, శారీరకంగా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా అందరి ముందు నవ్వుతూ కనిపించాలి. మేము కనిపించేంత అందంగా మా జీవితాలు ఉండవు అనే విధంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

అలా ఎందుకు రాస్తారో

అలా ఎందుకు రాస్తారో

తమన్నా వ్యాఖ్యల ఇంటర్వ్యూను ఉద్దేశించి ఓ పత్రిక సానుభూతిని పొందేందుకు తమన్నా ప్రయత్నిస్తున్నారు అనే కథనాన్ని ప్రచురించింది. ఈ క్రమంలో తాను ఆ పత్రికకు ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఎందుకు ఇలా రాస్తారో అర్థం కాదు. ఇలా రాసే ముందు ఒకసారి అడిగి తెలుసుకొంటే బాగుండేది అని తమన్నా వాపోయింది.

 కల్యాణ్‌రామ్‌తో నా నువ్వే

కల్యాణ్‌రామ్‌తో నా నువ్వే

నందమూరి కల్యాణ్‌రామ్‌తో తమన్నా భాటియా ప్రస్తుతం నా నువ్వే అనే చిత్రంలో నటిస్తున్నది. ఈ చిత్రానికి యాడ్ ఫిలిం డైరెక్టర్ జయేద్ర పంచపకేసన్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా పీసీ శ్రీరాం సినిమాటోగ్రఫిని అందిస్తున్నారు ఈ చిత్రం వర్మ, నాగార్జున కాంబినేషన్‌లో వస్తున్న ఆఫీసర్ చిత్రంతో పోటీ పడుతున్నది.

English summary
Tamannaah Bhatia has take to social media to SLAM the media for misquoting her. She is livid about false information being published about her. She said, Don’t misquote me for interviews I never gave or quote interview excerpts out of context just for the trp. Yellow journalism needs to stop.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu