»   » చావడానికి, చంపడానికైనా సిద్ధమే: తమన్నా, సినిమాలో కాదు నిజంగానే అంది

చావడానికి, చంపడానికైనా సిద్ధమే: తమన్నా, సినిమాలో కాదు నిజంగానే అంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

కొన్ని చిత్రాలు కొందరి తారల జీవితాలపై చాలా పెద్ద ప్రభావాన్నే చూపుతాయి. అదే విధంగా కొందరు తారలు వెనక్కి తిరిగి చూసుకుంటే తప్పకుండా ఒక్క చిత్రం అయినా గర్వపడేలా ఉండాలి. లేకపోతే అలాంటి వారి నట జీవితానికి అర్థం ఉండదు. నటి అనుష్కనే తీసుకుంటే అరుంధతి ఒక్కటి చాలు తనకు ఆత్మసంతృప్తిని కలిగించడానికి. అదే విధంగా తమన్నాకు బాహుబలి తన కెరీర్‌లో మైలురాయిగా నిలిచి పోతుంది.

సౌత్ స్టార్ హీరోయిన్, మిల్కీ బ్యూటీ తమన్నా కూడా భారీ పంచ్ డైలాగ్ చెప్తోంది. అది కూడా 'బాహుబలి' సినిమా విషయం లోనే. అయితే, తమన్నా ఆ రేంజ్ లో డైలాగ్ చెబుతుంది 'బాహుబలి' సినిమాలో అవంతిక పత్ర కోసమ కాదు మరి. సినిమా లో తనకు చాన్స్ రావటం గురించి చెబుతూ తమన్నా బయట చెబుతున్న మాట అది. కొంచెం కన్ఫ్యూషన్ గా ఉన్న ఈ స్టోరీలోకి వెళ్ళిపోతే,

Tamannaah Bhatia Wants To Die Or Even Kill For Baahubali

మొదట్లో 'బాహుబలి' లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పుడు మూవీలో కీలకమైన రోల్ ను దక్కించుకుని తమన్నా అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. ఈ విషయంలో మొదట కొంతమంది పెదవి విరిచినా.. తర్వాత మూవీ రిలీజ్ అయ్యాక తమన్నా ఆరబోసిన అందాలు, పెర్ఫార్మెన్స్ చూసి జనాలు ఫిదా అయిపోయారు.

బాహుబలి చిత్రంలో నటించడాన్ని చాలా సందర్భాల్లో చాలా గర్వంగా చెప్పింది.,తాజాగా బాహుబలి చిత్రంలో అవంతిక పాత్రను జీవితంలో మరచిపోలేననీ. అలాంటి అవకాశం రావడం తన అదృష్టంగా చెప్పింది. 'అది నా కెరీర్ పాతాళానికి పడిపోతున్న సమయం. అప్పుడు వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడుతున్నా. అలాంటి టైమ్ లో 'బాహుబలి ది బిగినింగ్' లాంటి ప్రాజెక్టులో భాగం అవడం అంటే ఎవరికైనా ఓ కల లాంటిదే.

అందుకే నా జీవితంలో నాకు అతి తేలికగా, అసలు ఊహించని విధంగా లభించిన అదృష్టం అదే' అని అంది. అలాంటి చిత్రం కోసం చావడానికైనా, చంపడానికైనా రెడీ అని చాలా ఎమోషనల్ గా చెప్పేసింది. ప్రస్తుతం బాహుబలి-2 చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే, ఈ చిత్రం షూటింగ్‌ ఈ నేలాఖరుకు పూర్తి అవుతుందని చెప్పిన తమన్నా తాజాగా విశాల్‌తో నటించిన కత్తిసండై చిత్రం తెలుగులో ఒక్కడొచ్చాడు పేరుతో విడుదల కానుంది. రెండు భాషల్లోనూ 23న తెరపైకి రానుంది.

English summary
Tamannaah Bhatia says she can do anything to be a part of a project like Baahubali
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu