»   » శ్రీదేవి అవార్డ్ అందుకోనున్న హీరోయిన్ తమన్నా

శ్రీదేవి అవార్డ్ అందుకోనున్న హీరోయిన్ తమన్నా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హీరోయిన్ తమన్నా అరుదైన గౌరవం అందుకోబోతున్నారు. గతంలో పలు సందర్భాల్లో శ్రీదేవి తన బిగ్గెస్ట్ ఇన్స్‌స్పిరేషన్ అని చెప్పిన తమన్నా.... ఇపుడు ఏకంగా శ్రీదేవి పేరు మీద అందించే అవార్డు అందుకోతున్నారు. దీంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

'జీ అప్సర అవార్డ్స్' కమిటీ 'శ్రీదేవి అవార్డ్'‌కు హీరోయిన్ తమన్నాకు ఎంపిక చేసింది. ఇటు హిందీతో పాటు అటు దక్షిణాది భాషల్లో సినిమా రంగానికి చేసిన సేవలకు‌గాను ఆమెను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. తనకు ఈ అవార్డు దక్కడంపై తమన్నా సంతోషం వ్యక్తం చేశారు.

Tamannah to be honoured with the Sridevi Award

సినిమా పరిశ్రమకు శ్రీదేవి ఎనలేని కృషి చేశారు. చిన్న వయసులోనే సినిమాకు ఆమె ఒక స్థాయికి చేరడానికి ఎంత కష్టపడి పని చేశారో నాకు తెలుసు. నేను ఆమె సినిమాలు చూస్తూ పెరిగాను తమన్నా తెలిపారు.

హిందీలో ఆ మధ్య వచ్చిన 'హిమ్మత్‌వాలా' రీమేక్ మూవీలో తమన్నా నటించారు. 1983లో వచ్చిన ఒరిజినల్ మూవీలో శ్రీదేవి పోషించిన పాత్రను 2013లో వచ్చిన రీమేక్‌లో తమన్నా నటించారు. ఈ చిత్రంలో తమన్నా నటకు విమర్శకుల ప్రశంసలు అందాయి.

English summary
Tamannah to be honoured with the Sridevi Award. The young actress is now being felicitated with Sridevi Award at Zee Apsara Awards for her contribution to Cinema and as a woman achiever.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X