»   » చలపాయ్ కామెంట్స్ దుమారం: బాలయ్య, అలీ వివాదాలు తెరపైకి!

చలపాయ్ కామెంట్స్ దుమారం: బాలయ్య, అలీ వివాదాలు తెరపైకి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'రారండోయ్ వేడుక చూద్దాం' ఆడియో వేడుకలో సీనియర్ నటుడు చలపతిరావు మహిళలను ఉద్దేశించి చేసిన నీచమైన కామెంట్స్ పెనుదుమారం రేపిన సంగతి తెలిసిందే. అతడు చేసిన కామెంట్స్ మానవజాతి మొత్తం సిగ్గుపడేలా ఉన్నాయని, ప్రతి మగాడికి తల్లి, చెల్లి, కూతురు ఉంటారనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా చలపతిరావు మాట్లాడారని మహిళా సంఘాల నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు.

చలపతిరావు మీద కేసు పెట్టడంతో పాటు విమర్శల వర్షం కురిపిస్తున్న మహిళా సంఘాలు.... గతంలో పలువురు సినీ స్టార్లు చేసిన వివాదాస్పద కామెంట్లను కూడా గుర్తు చేసుకుంటూ ఇకపై ఇలాంటివి సహించం, అప్పట్లోనే వారిపై కేసులు పెట్టి ఉంటే ఈ రోజు చలపతిరావు లాంటి వారి నోటి నుండి ఇలాంటి పిచ్చి కూతలు వచ్చేవి కావని అభిప్రాయ పడుతున్నారు.

చలపతిరావు చేసిన కామెంట్స్ ఏమిటంటే...

చలపతిరావు చేసిన కామెంట్స్ ఏమిటంటే...

‘రారండోయ్ వేడుక చూద్దాం' వేడుకలో మహిళా యాంకర్ చలపతి రావు దగ్గరకు వచ్చి అమ్మాయిలు ఆరోగ్యానికి హానికరమా సార్? అని అడగ్గా అడగ్గా....... దానికి చలపతిరావు సమాధానం ఇస్తూ అమ్మాయిలు ఆరోగ్యానికి హానికరం కాదు కానీ పక్కలోకి పనికొస్తారు అంటూ వివాదాస్పద కామెంట్ చేసారు.

చలపాయ్ కామెంట్లతో చిక్కుల్లో పడ్డ నాగార్జున, చైతూ

చలపాయ్ కామెంట్లతో చిక్కుల్లో పడ్డ నాగార్జున, చైతూ

తమ సినిమాకు సంబంధించిన ఆడియో వేడుక కావడంతో నాగార్జున, నాగ చైతన్య ఇబ్బందుల్లో పడ్డారు. చలపాయ్ చేసిన పనికి వీరిద్దరూ మీడియాకు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

బాలయ్య, అలీ గతంలో చేసిన కామెంట్స్ ప్రస్తావించిన మహిళా సంఘాలు

బాలయ్య, అలీ గతంలో చేసిన కామెంట్స్ ప్రస్తావించిన మహిళా సంఘాలు

చలపాయ్ వివాదంతో గతంలో బాలకృష్ణ, అలీ చేసిన కామెంట్లను పలువురు మహిళా సంఘాల నేతలు గుర్తు చేసారు. అపుడు వాళ్లని క్షమించి వదిలేసామని, ఇపుడు చలపతిరావు వ్యవహారంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

ఇంతకీ బాలయ్య అప్పట్లో ఏం కామెంట్ చేసారు?

ఇంతకీ బాలయ్య అప్పట్లో ఏం కామెంట్ చేసారు?

నారా రోహిత్ నటించిన సావిత్రి మూవీ ఆడియో వేడుకలో బాలయ్య చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వివాదాస్పదం అయ్యాయి. అందరూ అన్ని రకాల పాత్రలు చేయలేరు....నేను కొన్ని పాత్రలు మాత్రమే చేయగలను, అమ్మాయిల వెంట పడే పాత్రలు చేస్తే మా ఫ్యాన్స్ ఊరుకోరు. అమ్మాయికి ముద్దు అయినా పెట్టాలి... కడుపైనా చేయాలి, కమిట్ కమిట్ అంటూ వెళ్లి పోవాలి అంటూ బాలయ్య అప్పట్లో చేసిన కామెంట్స్ వివాదానికి దారి తీసాయి.

అలీ

అలీ

తెలుగు కమెడియన్ అలీ కూడా పలు సందర్భాల్లో ఆడియో వేడుకల్లో హీరోయిన్లను, యాంకర్లను ఉద్దేశించి కామెంట్స్ చేయడం వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే.

English summary
Actor Tamareddy Chalapathi Rao made some extremely derogatory comments about women. The comment resulted in massive backlash on social media, and an apology from producer of the film Nagarjuna Akkineni. Akkineni wrote on Twitter, "I always respect women personally and in my films/I definitely do not agree wt Chalapati rao's derogatory comments/dinosaurs do not exist".
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu