»   » ఆ నటున్ని సోషల్ మీడియాలో చంపేసారు

ఆ నటున్ని సోషల్ మీడియాలో చంపేసారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

"పెళ్ళి కొడుకు ఈయనే..., కానీ ఇతను వేసుకున్న డ్రెస్ మాత్రం నాది" అంటూ. "నరసింహ" సినిమాలో రజినీ కాంత్ ఏడిపించిన కమేడియన్ సెంథిల్ గుర్తున్నాడా..? తమిళ ఇండస్ట్రీలో చాలా సీనియర్ కామెడియన్ ఆయన. నిన్న సాయంత్రం నుంచీ సెంథిల్ చనిపోయాడనే వార్తలు సొషల్ మీడియా లో కనిపించాయి.

సెంథిల్ తెలుగు,తమిళ,కన్నడ,మళయాళ పరిశ్రమల్లోనూ సుపరిచితుడు కావటం తో ఈ వార్త వైరల్ అయిపోయింది. ఆయన అభిమానులే కాదు, తమిళ చిత్ర పరిశ్రమ నటులు కూడా కలవరం చెందారు. కొందరు నటులు డైరెక్ట్ గా సెంథిల్ ఇంటికే ఫోన్ చేసి కనుక్కోవటం తో అసలు విశయం అర్థమైంది.

తాను చనిపోయినట్టు వార్తలు రావటం తో తాజాగా సెంథిల్ వివరణ ఇచ్చారు. "నేను చాలా బాగున్నా. నా అభిమానులు, శ్రేయోభిలాషులు నా గురించి వచ్చిన వదంతుల్ని పట్టించుకోవద్దు" అంటూ ఆయన ఓ వీడియో సందేశాన్ని సోషల్ మీడియాలోనే పెట్టారు.

Tamil actor Senthil on death rumours

తమిళ చిత్రాల్లో కమెడియన్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సెంథిల్. ఆయన ఇప్పటివరకూ 500లకు పైగా చిత్రాల్లో నటించాడు. అర్జున్ తో వచ్చిన 'జెంటిల్మన్' లోనూ, రజినీ కాంత్ తో వచ్చిన 'నరసింహ', 'ముత్తు', 'అరుణాచలం' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకూ దగ్గరయ్యారు.

గత కొన్నేళ్లుగా సినిమాలనుంచి రాజకీయాల్లోకి వెళ్ళిన ఆయన పాలిటిక్స్ లోనే బిజీగా ఉంటున్నారు. ప్రస్తుత తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అధికార అన్నాడీఎంకే పార్టీకి ఆయన మద్దతు పలికారు.

English summary
I'm perfectly fine, says actor Senthil after death rumours
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu