»   » మనోజ్ ‘పోటుగాడు’కి.... తమిళ హీరో శింబు వాయిస్

మనోజ్ ‘పోటుగాడు’కి.... తమిళ హీరో శింబు వాయిస్

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : తమిళ హీరో శింబు ఇటీవల తెలుగు వచ్చిన జూ ఎన్టీఆర్ 'బాద్‌షా' చిత్రంలో డైమండ్ గర్ల్ సాంగుతో పాటు, 'బ్యాక్ బెంచ్ స్టూడెంట్' చిత్రంలో జగడ జగడ సాంగ్ పాడిన సంగతి తెలిసిందే. శింబు పాడిన ఈ పాటలకు తెలుగునాట మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా మరోసారి తెలుగులో ప్రేక్షకులకు శింబు తన వాయిస్ వినిపించబోతున్నారు. మంచు మనోజ్ హీరోగా రూపొందుతున్న 'పోటుగాడు' చిత్రంలో మంచు మనోజ్‌తో కలిసి ఓ పాటను పాడారు శింబు. ఇప్పటికే ఈ సాంగు రికార్డింగ్ కూడా పూర్తయింది. ఈ విషయాన్ని మంచు మనోజ్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

కన్నడ దర్శకుడు పవన్ వడెయార్ ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, లగడపాటి శ్రీధర్ ఈచిత్రాన్ని రామ లక్ష్మి సినీ క్రియేషన్స్ నిర్మిస్తున్నారు. పోటుగాడు చిత్రానికి హాలీవుడ్ స్టంట్ మాస్టర్ పని చేస్తున్నారు. ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ చిత్రంలో నలుగురు హీరోయిన్లు నటిస్తున్నారు. సాక్షి చౌదరి, సిమ్రాన్ ముండి, నథాలియా కౌర్ నటిస్తున్నారు. ఊకొడతారా ఉలిక్కి పడతారా చిత్రం తర్వాత మనోజ్ చేస్తున్న సినిమా ఇదే.

ఇక ఈ చిత్రం ఓ కన్నడ రీమేక్ . కోమల్ హీరోగా వచ్చిన 'గోవిందాయ నమ:'.. చిత్రం తెలుగులో 'పోటుగాడు' గా తెరకెక్కుతోంది. కన్నడంలో దర్శకత్వం చేసిన పవన్‌ ఈ చిత్రానికి సైతం దర్శకత్వం వహిస్తున్నారు. మంచు మనోజ్ చిత్రం గురించి చెప్తూ.. అటు పొగడ్తకి, ఇటు తెగడ్తకి రెండింటికీ సరిపోయే పదం 'పోటుగాడు'. నా శారీరకభాషకు సరిగ్గా సరిపోయే టైటిల్ ఇది. టైటిల్‌కి తగ్గట్టే ఇందులో తన పాత్ర కూడా ఉంటుందని మనోజ్ అంటున్నారు.

English summary
Tamil actor Simbu has teamed up with Manchu Manoj to croon for a number song for the latter's upcoming film Potugadu directed by Pawan Wadeyar. The two actors have already completed recording for the song.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu