»   » సిల్క్ స్మితను పరిచయం చేసిన ప్రముఖ నటుడు కన్నుమూత

సిల్క్ స్మితను పరిచయం చేసిన ప్రముఖ నటుడు కన్నుమూత

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ నటి సిల్క్ స్మితను సినీ పరిశ్రమకు పరిచయం చేసిన నటుడు, రచయిత విను చక్రవర్తి ఇకలేరు. కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 74 సంవత్సరాలు. విను చక్రవర్తికి భార్య, కుమారుడు, ఓ కూతురు ఉన్నారు. ఆయన అంత్యక్రియలు శుక్రవారం ముగిశాయి.

స్క్రిప్టు రైటర్‌గా..

స్క్రిప్టు రైటర్‌గా..

1945లో జన్మించిన విను చక్రవర్తి సినీ పరిశ్రమలో స్క్రిప్టు రైటర్‌గా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత నటుడిగా మారారు. దాదాపు 1002 చిత్రాల్లో నటించారు. ఆయన నటించిన చిత్రాలు తమిళంలోనే రూపొందాయి. చాలా కాలం కన్నడ దర్శకుడు పుత్తన కనగల్ వద్ద పనిచేశారు.

నటుడిగా మారి..

నటుడిగా మారి..

1977లో చక్రవర్తి నటన ప్రతిభను గుర్తించిన తమిళ నిర్మాత తిరుపుర మణి ఆయనకు నటనా అవకాశం కల్పించారు. కన్నడలో ఆయన నటించిన పరసంగడ గెండెటిమా అనే చిత్రం ఆయనకు బ్రేక్ ఇచ్చింది. తమిళంలో ఆయన నటించిన చిత్రాల్లో గొపురంగాళ్ సాయివథిల్లియా, మనిథాన్, గురు శిష్యన్, మప్పిల్లై, అమర్‌కలమా చిత్రాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

సిల్క్ స్మితను పరిచయం..

సిల్క్ స్మితను పరిచయం..

ప్రముఖ నటి, డ్యాన్సర్ స్కిల్క్ స్మితను తెరకు పరిచయం చేసిన ఘనత చక్రవర్తికే దక్కింది. విజయలక్ష్మి పేరుతో ఉన్న ఆమెను సిల్క్ స్మితగా తీర్చిదిద్దడంలో చక్రవర్తి విశేష కృషి ఉంది. ఆయన నటించిన చివరి చిత్రం వాయా మూడి పేసవం.

సిల్క్ స్మిత ఆత్మహత్య..

సిల్క్ స్మిత ఆత్మహత్య..

చక్రవర్తి అందించిన ప్రోత్సాహంతోనే సిల్క్ స్మిత తెలుగు, తమిళ రంగాల్లో రాణించింది. విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించింది. చివరి దశలో అవకాశాలు లేకపోవడం, వ్యక్తిగత జీవితంలో కలతలు చోటుచేసుకోవడంతో మనస్తాపం చెందిన సిల్క్ స్మిత ఆత్మహత్య చేసుకొన్నారు. ఆమె జీవిత కథ ఆధారంగా డర్టీ పిక్చర్ రూపొందిన సంగతి తెలిసిందే.

English summary
Tamil actor and writer Vinu Chakravarthy, who had starred in over 1,000 films, died in Chennai on Thursday. Chakravarthy was instrumental in launching the career of late actress Vijayalakshmi aka Silk Smitha.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu