»   » షాక్: కర్ణాటకలో తమిళ సినిమాల ప్రదర్శన రద్దు: దెబ్బకు దెబ్బ అంటే !

షాక్: కర్ణాటకలో తమిళ సినిమాల ప్రదర్శన రద్దు: దెబ్బకు దెబ్బ అంటే !

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగళూరు: తమిళనాడులో కన్నడ సినిమా ప్రదర్శనలు రద్దు చేసిన సందర్బంగా కర్ణాటకలో కన్నడ సంఘాలు భగ్గుమన్నాయి. బెంగళూరు నగరంతో సహ కర్ణాటకలో ఎక్కడ కూడా తమిళ సినిమాలు ప్రదర్శించరాదని కన్నడ సంఘాల నాయకులు హెచ్చరించారు.

బెంగళూరులోని అన్ని మాల్స్, సినిమా థియేటర్లలో వెంటనే తమిళ సినిమాల ప్రదర్శన నిలిపివేయాలని సూచించారు. మా మాట వినకుండా తమిళ సినిమాలు ప్రదర్శిస్తే పరిస్థితి వేరుగా ఉంటుందని కన్నడ సంఘాల నాయకులు హెచ్చరించారు.

కట్టప్ప క్షమాపణ చెప్పినా సరే

కట్టప్ప క్షమాపణ చెప్పినా సరే

కావేరీ జలాల విషయంలో కన్నడిగులను కించపరిచే విదంగా మాట్లాడారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బాహుబలి సినిమాలో కట్టప్ప పాత్రదారి సత్యరాజ్ శుక్రవారం కన్నడిగులకు క్షమాపణలు చెప్పారు. తన మాటలు మిమ్మల్ని బాధించి ఉంటే నన్ను క్షమించాలని మనవి చేశారు.

తమిళనాడులో కన్నడ సినిమాలు

తమిళనాడులో కన్నడ సినిమాలు

సత్యరాజ్ క్షమాపణలు చెప్పిన వెంటనే తమిళనాడులో కన్నడ సినిమాల ప్రదర్శన రద్దు చేసిన తమిళ ప్రజలు నిరసన వ్యక్తం చేశారని వెలుగు చూసిందని, అందుకే కర్ణాటకలో అన్ని తమిళ సినిమాల ప్రదర్శన అడ్డుకుంటామని శనివారం కన్నడ సంఘాల నాయకులు హెచ్చరించారు.

అప్పటి నుంచి ఇప్పటి వరకు

అప్పటి నుంచి ఇప్పటి వరకు

బాహుబలి-2 సినిమా ప్రదర్శన అడ్డుకుంటామని కన్నడ సంఘాలు హెచ్చరించడంతో 9 ఏళ్ల క్రితం తాను చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు కన్నడగిగులకు క్షమాపణ చెబుతున్నానని సత్యరాజ్ చెప్పారు.

బాహుబలి-2 విషయంలో ఇప్పుడే చెప్పం

బాహుబలి-2 విషయంలో ఇప్పుడే చెప్పం

సత్యరాజ్ క్షమాపణలు చెప్పారని తెలుసుకున్నామని, అయితే ఆ వీడియో పూర్తిగా చూసిన తరువాత బాహుబలి-2 సినిమా విడుదల చెయ్యడానికి అవకాశం ఇవ్వాలా ? వద్దా ? అనే విషయంపై నిర్ణయం తీసుకుంటామని కన్నడ సంఘాల ఐక్యవేదిక నాయకుడు వాటల్ నాగరాజ్ అంటున్నారు

సత్యరాజ్ దిష్టిబొమ్మ దహనం

సత్యరాజ్ దిష్టిబొమ్మ దహనం

బెంగళూరులోని మైసూరు బ్యాంక్ సర్కిల్ లో సత్యరాజ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేసిన కన్నడ సంఘాలు ఆయన దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. సత్యరాజ్ కు కన్నడిగులు తగిన బుద్ది చెబుతారని కన్నడ సంఘాల నాయకులు హెచ్చరించారు.

ఆందోళనలో పంపిణిదారులు

ఆందోళనలో పంపిణిదారులు

తమిళ సినిమాల కర్ణాటక పంపిణి హక్కులు తీసుకున్న వ్యాపారులు ఇప్పుడు హడలిపోతున్నారు. తమిళ సినిమా ప్రదర్శన రద్దు చేస్తే పైరసీ డీవీడీలు మార్కెట్ లోకి వస్తే తాము తీవ్రస్థాయిలో నష్టపోతామని ఆందోళన చెందుతున్నారు.

English summary
Kannada Leaders Decided to Tamil Films Has Stopped in Karnataka After Kannada Films Stops in Tamil Nadu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu