»   » షూటింగ్ లో తీవ్రంగా గాయ పడ్డ హీరో విశాల్

షూటింగ్ లో తీవ్రంగా గాయ పడ్డ హీరో విశాల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినిమా ఫైటింగ్ అంటే డూప్ ఉండతం సర్వసాధారణం, హీరో క్షేమం కోసం నిపుణులైన డూప్లతో యాక్షన్ సన్ని వేశాలను చిత్రీకరిస్తారు. కానీ ఈ మధ్య కాలంలో హీరోలు డూప్ లేకుండా నటిస్తున్నారు. తమ అభిమానులు తామే ఆ స్టంట్స్ చేసాం అనుకుంటారనీ వారిని నిరాశ పరచలేకే కొన్ని సాహసాలు చేస్తామని చెప్తూంటారు. అయితే ఈ ఒప్రయత్నం లో అభిమానులకోసం తీవ్రంగా గాయపడుతున్నారు. ఇలాంటి సంఘటనలు దాదాపు అన్ని ఇండస్ట్రీలో చూస్తునే ఉన్నాం.

తమిళ హీరో విశాల్ కూడా ఇలా స్టంట్స్ చేసే విశయం లో ముందుంటాడు.తన అభిమానుల కోసం ఆ మాత్రం చేయాల్సిందే అని చెప్తూంటాడు కూదా. ఇదివరలో కొన్ని గాయాల పాలైన విశాల్ ఇప్పుడు మళ్ళీ తన కొత్త సినిమా "కత్తి సండై" షూటింగ్ సందర్భంగా విశాల్ గాయపడ్డాడు. చెన్నైలోని ఓ షాపింగ్ మాల్ లో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా. ఓ ఫైటర్ అతడి మీద అటాక్ చేసే సీన్ తీస్తుండగా ప్రమాదం జరిగింది. వెంటనే ఆయనను సమీప ఆసుపత్రికి తీసుకెళ్లారు.

Tamil hero Vishal hurt during shooting

చికిత్స చేసిన డాక్టర్లు కొన్ని రోజుల పాటు విశాల్ మంచం దిగకుండా విశ్రాంతి తీసుకోవాల్సిందిగా చెప్పారట. గాయం కాస్త తీవ్రంగానే అయ్యిందని చెప్పుకుంటున్నారు. ఇక తన సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలకు పెద్ద పీట వేసే విశాల్. గతంలో రెండు మూడు సార్లు షూటింగ్ సందర్భంగా గాయపడ్డాడు. కొన్ని రోజుల పాటు ఇంటి పట్టునే ఉండాల్సిన పరిస్థితికి చేరుకున్నాడు. సూరజ్ దర్శకత్వం వహిస్తున్న "కత్తి సండై" ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్.

ఈ సినిమాలో విశాల్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా కథానాయికగా నటిస్తుందిం. విశాల్ లేటెస్ట్ మూవీ "మరుదు" హిట్ టాక్ తో నడుస్తోంది. ఈ సినిమా "రాయుడు" పేరుతో ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భుజానికి గాయం కావడంతో విశాల్ ని కొన్ని రోజులు పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిందిగా డాక్టర్లు కోరారట.

English summary
Tamil hero Vishal hurt during shooting of an action episod in his new Movie Kaththi Sandai
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu