twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాహుబలి నచ్చలేదని చెబితే కొడతారని భయం వేసింది.. నాగ అశ్విన్ మతి పోగొట్టాడు!

    |

    Recommended Video

    Tammareddy Bharadwaj About Mahanati

    దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సోషల్ మీడియా వేదికగా తనదైన శైలిలో సినీ రాజకీయ అంశాల గురించి మాట్లాడుతుంటారు. ఇండస్ట్రీలో ఏ వివాదం చోటు చేసుకున్నా తమ్మారెడ్డి తన అభిప్రాయాన్ని తెలియజేస్తారు. మహానటి చిత్రం విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. మహానటి చిత్రం గురించి తమ్మారెడ్డి స్పందించారు. కీర్తి సురేష్ మహానటి సావిత్రి పాత్రలో నటించగా, దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవర కొండ ప్రధాన పాత్రల్లో నటించారు.

    బాహుబలి నచ్చలేదు

    బాహుబలి నచ్చలేదు

    2014 లో విడుదలైన బాహుబలి తొలి భాగం చూశాను. తనకు అంతగా నచ్చలేదని తమ్మారెడ్డి అన్నారు. థియేటర్ బయటకు వచ్చి బాగాలేదని చెబితే కొడతారని భయం వేసి బావుందని చెప్పా అని తమ్మారెడ్డి తెలిపారు.

    బాహుబలి 2 మ్యాజిక్

    బాహుబలి 2 మ్యాజిక్

    నచ్చలేదని చెబితే కొట్టేంతలా జనాలకు బాహుబలి నచ్చేసింది. బాహుబలి చిత్రం మ్యాజిక్ చేసింది. మొదటి భాగాన్ని మించేలా రెండవ భాగం మ్యాజిక్ చేసిందని తమ్మారెడ్డి అన్నారు.

    ఎక్కడ చూసినా మహా నటి

    ఎక్కడ చూసినా మహా నటి

    ఇటీవల విడుదలైన మహానటి చిత్రం గురించి తమ్మారెడ్డి స్పందించారు. ఇప్పుడు ఎక్కడా చూసినా అంతా మహా నటి చిత్రం గురించే మాట్లాడుకుంటున్నారని తమ్మారెడ్డి తెలిపారు. ఈ చిత్రం మే 9 న బుధవారం విడుదలైంది. బుధవారం విడుదలైన చిత్రం గురువారం తగ్గిపోవాలి. కానీ రోజు రోజుకు ఈ చిత్ర వసూళ్లు పెరుగుతూ వచ్చాయని తమ్మారెడ్డి అన్నారు.

    బయోపిక్ చిత్రాన్ని అలా

    బయోపిక్ చిత్రాన్ని అలా

    దర్శకుడు నాగ అశ్విన్ పని తనాన్ని తమ్మారెడ్డి అభినందించారు. బయోపిక్ చిత్రాన్ని పిలాసఫికల్ గా చెప్పడం చాలా కష్టం. కానీ ఆ పనిని నాగ అశ్విన్ అద్భుతంగా చేసాడని తమ్మారెడ్డి అన్నారు.

    3 గంటలు ఏమీ ఆలోచించలేదు

    3 గంటలు ఏమీ ఆలోచించలేదు

    సావిత్రి పాత్రలో నటించిన కీర్తి సురేష్ అద్భుతంగా నటించిందని తమ్మారెడ్డి అన్నారు. సినిమా చూస్తున్న మూడు గంటలే మరే ఆలోచన రాలేదని తమ్మారెడ్డి అన్నారు.

    మతి పోగొట్టారు

    మతి పోగొట్టారు

    చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరించిన స్వప్న, ప్రియాంక దత్ ని కూడా తమ్మరెడ్డి అభినందించారు. మొత్తగా మహానటి చిత్ర యూనిట్ మతి పోగొట్టేలా అద్భుతమైన చిత్రాన్ని తీశారని అభినందించారు.

    English summary
    Tammareddy Bharadwaj Comments on Keerthy Suresh. He compares Mahanati with Bahubali
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X