twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తమిళులకు అహంభావం ఎక్కువ, చచ్చినా ఆ పని చేయరు.. అలాంటిది రాజమౌళి గురించి!

    |

    సూపర్ స్టార్ రజనీకాంత్, శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ 2.0. అక్షయ్ కుమార్ పక్షి రాజుపాత్రలో విలన్‌గా నటించారు. 600 కోట్ల భారీ బడ్జెట్‌లో తెరకెక్కించిన ఈ చిత్రం గురించే సినీవర్గాల్లో చర్చ జరుగుతోంది. గురువారం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైన 2.0 చిత్రం మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. 2.0 చిత్రం విడుదలైన సందర్భంగా ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాహుబలి, 2.0 చిత్రాన్ని పోల్చుతూ అయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

    ఇండియన్ సినిమాలో చాలా పెద్ద పేరు

    ఇండియన్ సినిమాలో చాలా పెద్ద పేరు

    దర్శకుడు శంకర్ అంటే ఇండియన్ సినిమాలో చాలా పెద్ద పేరు అని తమ్మారెడ్డి అన్నారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 2.0 చిత్రంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. శంకర్ సినిమాలు విడుదలైతే హీరోలకన్నా అతడి గురించే ఎక్కువగా మాట్లాడుకుంటారు. అలాంటి శంకర్ తెరకెక్కించిన 2.0 ప్రచారంలో మన రాజమౌళి గురించి, బాహుబలి చిత్రం గురించి మాట్లాడారని తమ్మారెడ్డి అన్నారు.

     అహంభావం ఎక్కువ

    అహంభావం ఎక్కువ

    సాధారణంగా తమిళులకు అహంభావం ఎక్కువ. పక్కవారి గురించి ప్రశంసించడం కానీ, ఎక్కువఆ మాట్లాడడం కానీ చచ్చినా చేయరు. ఇండియన్ సినిమాలోనే కాస్ట్లీ చిత్రాన్ని తెరకెక్కించిన శంకర్ ప్రచార కార్యక్రమంలో రాజమౌళి గురించి మాట్లాడారు. శంకర్ మాత్రమే కాదు ఇండియన్ సినిమాకే సూపర్ స్టార్ అయిన రజనీకాంత్ కూడా రాజమౌళిని ప్రశంసించి, 2.0 చిత్రాన్ని బాహుబలితో పోల్చారు. ఈ విషయం తెలుగువారందరికీ గర్వకారణం అని తమ్మారెడ్డి అన్నారు.

    మా హీరోలు, మా కలెక్షన్ల గురించి మీకెందుకు?.... మీరు చంపుతామంటే భయపడేంత సీన్ లేదు!మా హీరోలు, మా కలెక్షన్ల గురించి మీకెందుకు?.... మీరు చంపుతామంటే భయపడేంత సీన్ లేదు!

    పవన్ కళ్యాణ్ గురించి కూడా

    పవన్ కళ్యాణ్ గురించి కూడా

    చాలా సినిమా ఈవెంట్స్ లో పవన్ కళ్యాణ్ ని తలుచుకోకుండా ఉండరు. వాళ్ళ చిత్రానికి పవన్ కళ్యాణ్ కు సంబంధం లేకపోయినా ఫ్యాన్స్‌లో ఉన్నా క్రేజ్‌తో పవన్ గురించి మాట్లాడతారు. ఇక్కడ కూడా అంతే. రాజమౌళికి, 2.0 చిత్రానికి ఎలాంటి సంబంధం లేదు. అయినా కూడా రాజమౌళిని తలుచుకున్నారని తమ్మారెడ్డి అన్నారు.

    వాళ్ళు ముగ్గురూ

    వాళ్ళు ముగ్గురూ

    శంకర్ చాలా రోజులుగా తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. రజనీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాలీవుడ్ లో కరణ్ జోహార్ అగ్ర నిర్మాత. వీళ్లంతా 2.0 ప్రచారం కోసం బాహుబలి చిత్రంతో పోల్చుకుంటుండడం తెలుగు సినిమా స్థాయి పెరిగిందనేదానికి నిదర్శనం అని తమ్మారెడ్డి అభిప్రాయపడ్డారు. నందమూరి తారకరామారావు తెలుగువారి ఆత్మగౌరవాన్ని పెంచితే, రాజమౌళి తెలుగు సినిమా స్థాయిని పెంచారని అన్నారు.

    English summary
    Tammareddy Bharadwaj sensational comments on 2Point0. Tammareddy Bharadwaj Praises Rajamouli.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X