»   » పవన్ ఫ్యాన్స్ బూతులు: తమ్మారెడ్డి ఘాటు రిప్లై!

పవన్ ఫ్యాన్స్ బూతులు: తమ్మారెడ్డి ఘాటు రిప్లై!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల తీరుపై తెలుగు దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆగ్రహం వ్యక్తం చేసారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తీరు బాగో లేదని, బూతులు తిడుతున్నారని ఆయన మండి పడ్డారు. ఇందుకు ఆయన ఘాటుగా వీడియో మెసేజ్ ద్వారా రిప్లై ఇచ్చారు.

Tammareddy Bharadwaj sensational reply to all the Pawan Kalyan Fans

తమ్మారెడ్డి మాట్లాడుతూ.....''పవన్ కళ్యాణ్ తాను రాజకీయాల్లోకి వచ్చిందే ప్రశ్నించడానికి అని చెప్పారు. అలా చెప్పిన ఆయన ప్రశ్నించడం మానేసి టీఆర్ఎస్, వైఎస్ఆర్‌సిపి పార్టీలను తిడుతున్నారు. అలాంటి అవసరం ఏముంది. ఆయన ప్రజలకు ఏం చేస్తాడో చెప్పమనండి. అంతేకానీ తిట్టాల్సిన అవసరం ఏముంది. రాజకీయాల్లో అందరూ దొంగలే. దొంగ ఎవరు? దొర ఎవరు? అనేది ఎన్నికల్లో ప్రజలే తేలుస్తారు. పవన్ కళ్యాణ్ తీరును తప్పుబట్టినందుకు నన్ను కొందరు బూతులు తిడుతున్నారు. చదువుకున్న వారు చదువుకున్నట్లుగా ఉండాలి'' అంటూ తమ్మారెడ్డి భరద్వాజా ఘాటుగా రిప్లై ఇచ్చారు.

మొత్తానికి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రావడంపై సినిమా పరిశ్రమలో కూడా భిన్న అభిప్పాయాలు ఉన్నాయని తమ్మారెడ్డి భరద్వాజ వ్యాఖ్యలు బట్టి తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ తెలుగు దేశం పార్టీ తరుపున ప్రచారం చేయడం పరిశ్రమలో పలువురికి నచ్చడం లేదనేది తాజా సంఘటనను బట్టి స్పష్టమవుతోంది.

English summary
Tammareddy Bharadwaj sensational reply to all the Pawan Kalyan Fans.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu