»   » వాడికెందుకు? వాడి అయ్య జాగీరా?.... ‘అర్జున్ రెడ్డి’ మూవీ ఇష్యూపై ఫైర్!

వాడికెందుకు? వాడి అయ్య జాగీరా?.... ‘అర్జున్ రెడ్డి’ మూవీ ఇష్యూపై ఫైర్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

విజయ్‌దేవర కొండ, షాలిని హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం 'అర్జున్‌ రెడ్డి'. సందీప్‌రెడ్డి వంగా దర్శకుడు. ప్రణయ్‌ రెడ్డి వంగా నిర్మాత. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ సంచలనకామెంట్స్ చేశారు.

'అర్జున్ రెడ్డి' సినిమా 3 గంటలు తీయడాన్ని కొందరు సోషల్ మీడియాలో విమర్శలు చేయడంపై తమ్మారెడ్డి స్పందిస్తూ..... వాడికెందుకయ్యా? వాడి అయ్య జాగీరా? మూడు గంటలు సినిమా తీస్తడు, 30 గంటలు సినిమా తీస్తడు. నిర్మాత, దర్శకుడు, హీరో సినిమాను నమ్ముకుని సినిమా తీస్తారు అని వ్యాఖ్యానించారు.


వాడి పైసలా? నచ్చకపోతే చూడకు

వాడి పైసలా? నచ్చకపోతే చూడకు

సోషల్ మీడియాలో 3 గంటలట సినిమా అంటూ కామెంట్ చేస్తున్నారు కొందరు... ఏమైతది? వాడి పైసలా? నచ్చకపోతే వాడు చూడొద్దు? అంటూ ఘాటుగా స్పందించారు తమ్మారెడ్డి.


Pelli Choopulu Fame Vijay Devarakonda's Arjun Reddy Movie Trailer Out
ముద్దు పెట్టుకుంటే నీదేంబోయిందయ్యా?

ముద్దు పెట్టుకుంటే నీదేంబోయిందయ్యా?

ఇంకోడెవడో వస్తడు... ముద్దు పెట్టుకున్నారంట ఏందయ్యా అని? విమర్శిస్తడు. ముద్దు పెట్టుకుంటే నీదేంబోయిందయ్యా? రాకు నువ్వు థియేటర్‌కు? అన్నీ వీళ్లకే కావాలి. పోనీ మంచి సినిమా తీస్తే చూస్తరా? అంటూ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు తమ్మారెడ్డి. ఇటీవల కాంగ్రెస్ పార్టీ నేత వి.హనుమంతరావు అర్జున్ రెడ్డి ముద్దు పోస్టర్లను చించేసిన సంగతి తెలిసిందే.


నువ్వేమైనా హెల్ప్ చేస్తవా?

నువ్వేమైనా హెల్ప్ చేస్తవా?

ముద్దు పెట్టడు, మూడు గంటలు సినిమా తీయడు నువ్వు రిలీజ్ చేస్తవా? హెల్ప్ చేస్తవా? ఎవ్వడేం చెయ్యడు. సోషల్ మీడియాలో, రాజకీయ నాయకులు, కొందరు పిచ్చోళ్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. సినిమా వాళ్లు ఊరికే దొరికారు కదా అని ఎవరు పడితే వారు రాయి వేయడం అలవాటయిపోయింది... అని తమ్మారెడ్డి మండి పడ్డారు.


వాళ్లని బాయ్ కాట్ చేయండి

వాళ్లని బాయ్ కాట్ చేయండి

ఎవరు ఎలాంటి విమర్శలు చేసినా ప్రేక్షకులు మాకు సపోర్టుగా ఉన్నారు. సోషల్ మీడియాలో అలా మాట్లాడే వారిని మీరంతా బాయ్ కాట్ చేయాలని కోరుకుంటున్నాను. సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను అంటూ తమ్మారెడ్డి వ్యాఖ్యానించారు.English summary
Check out Thammareddy Bharadwaja Speech at Arjun Reddy Audio Launch. 'Arjun Reddy' movie Starring Vijay Deverakonda, Shalini, Music Composed by Radhan, Directed by Sandeep Vanga and Produced by Pranay Vanga under the banner of Bhadrakali Pictures.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu