చెప్పేదొకటి, చేసేదొకటి: పవన్ కళ్యాణ్‌పై దర్శకుడి ఫైర్ (వీడియో)
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల జన సేన పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. అధికారంలోకి రావడం పార్టీ లక్ష్యం కాదు...ప్రజల తరుపున వారి సమస్యలపై అధికార పక్షాన్ని పశ్నించడమే లక్ష్యంగా పార్టీ పని చేస్తుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మూలంగానే తెలుగు ప్రజలు కష్టాలు పడుతున్నారని చెప్పిన ఆయన ఎన్నికల్లో ఆ పార్టీకి వ్యతిరేకంగా...టీడీపీ, బీజేపీ పార్టీలకు అనుకూలంగా ప్రచారం చేసారు.
కాగా ఎన్నికల ప్రచారం సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రవర్తించిన తీరును పలువురు తప్పుబడుతున్నారు. ప్రముఖ తెలుగు నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ పవన్ కళ్యాణ్ తీరును బహిరంగంగా ఎండగట్టారు. ఆయన చెప్పింది ఒకటి, చేసేది మరొకటి అంటూ మండి పడ్డారు.
ఈ మేరకు ఆయన ఓ వీడియో మెసేజ్ ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడిచారు. అదే విధంగా పవన్ కళ్యాణ్ అభిమానులు తీరుపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేసారు. అందుకు సంబంధించిన వీడియో చూసేందుకు క్రింది ఫోటోను క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications












