»   » తమ్మారెడ్డి కామెంట్: చిరు లేకుంటే పవన్ లేడు, కత్తులు దూసుకోవాలా ఏంటి?

తమ్మారెడ్డి కామెంట్: చిరు లేకుంటే పవన్ లేడు, కత్తులు దూసుకోవాలా ఏంటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మధ్య అసలు పడటం లేదని, ఇద్దరి మధ్య విబేధాలు ఉన్నాయని.... కొంత కాలంగా మీడియాలో, సోషల్ మీడియాలో రకరకాల ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

చిరంజీవి కోరీర్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 150వ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఈ నెల 7న గుంటూరు-విజయవాడ మధ్య ఉన్న హాయ్‌లాండ్ లో జరుగుతున్న నేపేథ్యంలో.... ఈ వేడుకకు పవన్ వస్తాడా? రాడా? ఒక వేళ రాకుంటే ఇద్దరి మధ్య విబేధాలు మరింత ముదిరినట్లేనా? అంటూ ఓ చర్చ సాగుతోంది.

ఈ పరిణామాలపై ప్రముఖ తెలుగు ఫిల్మ్ మేకర్ తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. 'నా ఆలోచన' పేరుతో యూట్యూబ్ లో చిరు-పవన్ అంశంపై తనదైన రీతిలో స్పందించారు. కొన్ని చూస్తుంటే ఈ దేశంలో ఎవరైన కలిసి సంతోషంగా ఉంటే సహించే పరిస్థితి లేదేమో అనిపిస్తుందన్నారు.

 చిరు-పవన్

చిరు-పవన్

చిరంజీవి గారు చాలా కష్టపడి మెగాస్టార్ గా ఎదిగారు. ఆయనకు తమ్ముళ్లంటే, ఫ్యామిలీ అంటే విపరీతమైన ప్రేమ. ఆ ఫ్యామిలీ నుండి వచ్చిన తమ్ముడు పవన్ కళ్యాణ్ అంటే ఆయనకు చాలా ఇష్టం. పవన్ కళ్యాణ్ గారికి కూడా అన్నయ్య అంటే కూడా అంతకంటే ఎక్కువ అభిమానం అని తమ్మారెడ్డి భరద్వాజ చెప్పుకొచ్చారు.

 చిరంజీవికి సమానంగా ఎదిగారు

చిరంజీవికి సమానంగా ఎదిగారు

పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా తర్వాత చిరంజీవికి ఈక్వల్ లెవల్ కి వెళ్లి పోయాడు. అపుడు చిరంజీవి ఎంతో సంతోష పడ్డారు. ఖుషీ సినిమా సూపర్ హిట్ అయ్యాక పవన్ గురించి చిరు ఎంతో గొప్పగా చెప్పుకొన్నారు, సినిమాలో పవన్ చేసిన ఫైట్స్ బావున్నాయని, తన తర్వాతి మూవీ డాడీ సినిమా కోసం పవన్ కళ్యాణ్ తో ఫైట్స్ కంపోజ్ చేయించుకున్నారని తెలిపారు తమ్మారెడ్డి చెప్పుకొచ్చారు.

 కత్తులు దూసుకోవాలా ఏంటి?

కత్తులు దూసుకోవాలా ఏంటి?

ఇద్దరు వ్యక్తుల భావజాలాలు వేర్వేరుగా ఉన్నంత మాత్రాన వాళ్లు విడిపోవాలి..కత్తులు దూసుకోవాలన్నట్లుగా కొందరు ఆలోచిస్తున్నారు, అలా చేయడం అంత మంచి పరిణామా కాదని తమ్మారెడ్డి వ్యాఖ్యానించారు.

rn

చిరంజీవి లేకపోతే పవన్ ఉన్నాడా?

చిరంజీవి లేకుంటే పవన్ కళ్యాణ్ లేడు.... రాజకీయంగా ఎవరి దారి వాది, ఎవరి ఆలోచనలు వారివి కావచ్చు, అన్నదమ్ములగా వారు ఎప్పుడూ కలిసే ఉన్నారు. వాళ్ల మధ్య ఏదో ఉందంటూ ఊహాగానాలు సృష్టించడం మంచిది కాదని, వీలైతే కలుపుదాం కానీ.. విడగొట్టే పని మాత్రం చేయొద్దు అంటూ తమ్మారెడ్డి భరద్వాజ వ్యాఖ్యానించారు.

English summary
Tammareddy Reveals Shocking Reasons behind Chiranjeevi & Pawan Kalyan Split. He says till today, the relationship between Chiranjeevi and Pawan Kalyan is very Strong but some people are making rumours on this & Finally he concludes that in Mega Family young heroes like Ram Charan, Allu Arjun, Varun Tej & Sai Dharam Tej they have learned to stand on their own feet & its really happy to see them.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu