»   » చిరంజీవికి డబ్బులే ఇవ్వలేదు.. ఆ కోపంతోనే.. తమ్మారెడ్డి భరద్వాజ కంటతడి

చిరంజీవికి డబ్బులే ఇవ్వలేదు.. ఆ కోపంతోనే.. తమ్మారెడ్డి భరద్వాజ కంటతడి

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా నిర్మాతగా తెరకెక్కించిన‌ చిత్రం ప్యార్ ప్రేమ కాదల్. తమిళనాట ఘనవిజయం సాధించిన ఈ చిత్రాన్ని ద‌ర్శ‌క‌నిర్మాత‌ తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో శ్రీ తిరుమల ప్రొడక్షన్ ప‌తాకంపై యువన్ శంకర్ రాజా - విజయ్ మోర్వనేని సంయుక్తంగా తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఎలన్ ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. హరీష్ కళ్యాణ్, రైజ విల్సన్ జంట‌గా న‌టించారు. యువన్ శంకర్ రాజా స్వ‌యంగా సంగీతం అందించారు. ఈ సినిమా ట్రైలర్ ని మెగాస్టార్ చిరంజీవి ఆవిష్క‌రించి ఆశీస్సులు అందించారు.

  Tammareddy Bharadwaj Talks About Maa Issue

  ప్లాప్ షో.. చిరంజీవి వెళ్లినా నిరసన, ఇద్దరూ రోడ్డున పడ్డారు!

   నాన్నపై కోపంతో

  నాన్నపై కోపంతో

  ఈ సందర్భంగా చిత్ర స‌మ‌ర్ప‌కుడు త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ మాట్లాడుతూ...'40 ఏళ్ల క్రితం మెగాస్టార్‌తో `మొగుడు కావాలి` సినిమా తీశాను. మా నాన్న‌గారిపై కోపంతో చిరుకి ఫోన్ చేసి మ‌నం సినిమా చేయాలి అని అడిగాను. ఆ సినిమా క‌థేంటి.. ద‌ర్శ‌కుడెవ‌రు? అన్న‌ది కూడా అడ‌గ‌కుండా మెగాస్టార్ చిరంజీవి అంగీక‌రించారు అని తెలిపారు.

  చిరంజీవితో అనుబంధం వేరు

  చిరంజీవితో అనుబంధం వేరు

  చిరంజీవితో నా అనుబంధం వేరు. ఆయ‌న‌తో రెండు సినిమాలు చేశాను. వాటికి డ‌బ్బులే ఇవ్వ‌లేదు త‌న‌కి. అలా జ‌రిగిపోయాయి ఆ రెండు సినిమాలు.ఆ త‌ర్వాత చాలా కాలం సినిమాల ప‌రంగా మేం క‌లుసుకోలేదు. ఆ త‌ర్వాత నేను ద‌ర్శ‌కుడిని అవుతూ `అల‌జ‌డి` సినిమా చేస్తే నేను పిల‌వ‌కుండానే ఆయ‌న వ‌చ్చి స‌క్సెస్‌ పార్టీ ఇచ్చారు అని తమ్మారెడ్డి ఉద్వేగానికి గురయ్యారు.

  చిరంజీవి సాయం

  చిరంజీవి సాయం

  క‌న్న‌డ టీవీ షోస్ చేస్తుంటే ఒక అనాథకు కంటి ఆప‌రేష‌న్ చేశారు. చిరంజీవి గారిని చూడాల‌న్న‌ది ఆ అమ్మాయి కోరిక‌. నేను చెప్ప‌గానే చిరంజీవి అక్క‌డికి వ‌చ్చారు. అదే రోజు `చ‌రిత చిత్ర` తొలి టీవీ షో ఓపెనింగుకి వ‌చ్చి చిరంజీవి సాయ‌ం అందించారు. ఆరోజు చిరంజీవి వేరు. ఇప్పుడు చిరంజీవి వేరు. ఇప్పుడు కూడా మ‌రోసారి ఈ సినిమా ట్రైలర్ ఆవిష్కరించారు.

  చిరంజీవి మెగాస్టార్ ఎందుకయ్యాడంటే

  చిరంజీవి మెగాస్టార్ ఎందుకయ్యాడంటే

  చిరంజీవి గురించి ఒక మాట‌ చెప్పాలి. చిరంజీవికి సినిమా అంటే పిచ్చి. నా తొలి సినిమా `కోత‌ల‌రాయుడు`కి డ్యాన్స్ మాష్ట‌ర్లు, ఫైట్ మాష్ట‌ర్లు లేరు. ఆయ‌నే ఫైట్ మాస్ట‌ర్. ఆయ‌నే డ్యాన్స్ మాస్టర్. నేను నిర్మించిన‌ `మొగుడు కావాలి` టైమ్‌లో 47రోజుల ఫారిన్ షెడ్యూల్ ఉంది. ప్యారిస్ వెళ్లాలి. షెడ్యూల్స్ వేస్ట్ కాకూడ‌ద‌ని ఎంతో రిస్క్ తీసుకుని మరీ షూటింగ్ చేశారు. 40 ఏళ్ల నుంచి ఆయన మెగాస్టార్ ఎందుక‌య్యారు అంటే ఇంత క‌ష్ట‌ప‌డ్డారు కాబ‌ట్టే... అని త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ తెలిపారు.

   మెగాస్టార్ ఆశీస్తులతో

  మెగాస్టార్ ఆశీస్తులతో

  యువ‌న్ శంక‌ర్ రాజా తొలి సారి నిర్మాత‌గా రూపొందించిన `ప్యార్ ప్రేమ కాద‌ల్` చిత్రాన్ని బాగా న‌చ్చి రిలీజ్ చేస్తున్నాం. 12 పాట‌లు ఉన్న చిత్ర‌మిది. యంగ్ టీమ్ అద్భుతంగా చేశారు`` అని తమ్మారెడ్డి తెలిపారు. యువ‌న్ శంక‌ర్ రాజా మాట్లాడుతూ-``మెగాస్టార్ ఆశీస్సుల‌తో ఈ సినిమా రిలీజ్ చేయ‌డం సంతోషంగా ఉంది. నిర్మాత‌గా తొలి ప్ర‌య‌త్నం ఎంతో ఎగ్జ‌యిటింగ్‌గా ఉంది. అంద‌రి ఆద‌ర‌ణ కావాలి`` అన్నారు.

  English summary
  Pyaar Prema Kaadhal is a Tamil language romantic comedy film starring Harish Kalyan and Raiza Wilson in the lead roles. The film is written and directed by Elan with music composed by Yuvan Shankar Raja, cinematography done by Raja Bhattacharjee, edited by S. Manikumaran and the film is jointly produced by Yuvan Shankar Raja and Tammareddy Bhardwaja under their banners YSR Films and K Productions. This movie coming as dub in telugu with same title. This movie trailer unveiled by Megastar Chiranjeevi. In occassion, Tammareddy get emotional while recollecting the relation with him.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more