»   » అర్దరాత్రి వాహనాన్ని ఢీ కొట్టిన హీరో తనీష్..కేసు

అర్దరాత్రి వాహనాన్ని ఢీ కొట్టిన హీరో తనీష్..కేసు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : వర్దమాన సినీ హీరో రైడ్, కోడిపుంజు ఫేం తనీష్ జూబ్లి హిల్స్ రోడ్ నెంబర్ 10 లో అర్దరాత్రి ద్వి చక్ర వాహనాన్ని ఢీ కొట్టాడు. వాహనదారుడికి స్వల్ప గాయాలయ్యాయి. జూబ్లిహిల్స్ పోలీసులు సంఘటనా స్ధలానికి వచ్చి కేసు పరిశీలుస్తున్నారు. ఈ హీరో మధ్య మత్తులో ఉన్నట్లు భాథితులు ఆరోపిస్తున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే...

సినీ హీరో తనీష్‌పై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో న్యూసెన్స్ కేసు నమోదైంది. గురువారం రాత్రి హీరో తనీష్ తన కారులో జూబ్లిహిల్స్ రోడ్ నెంబర్ 45 లో ముందు వెళ్తున్న సురేష్ అనే స్కూటరిస్టును ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయాడు. దీంతో బాధితుడు కారును వెంబడించి జూబ్లీహిల్స్ చెక్ పోస్టులో అడ్డుకోవడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో పోలీసులు ఇద్దరిపై న్యూసెన్స్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tanish accident at Hyderabad

తనీష్‌, మోహిత జంటగా శ్రీ చీర్ల మూవీస్‌ రూపొందిస్తున్న సినిమా ఆ మధ్యన ప్రారంభోత్సవం జరిగింది. యశస్విని సమర్పిస్తున్నారు. సంజీవ్‌ మేగోటి దర్శకుడు. శ్రీనివాస యాదవ్‌ నిర్మాత. సంజీవ్‌ మేగోటి మాట్లాడుతూ ‘‘‘పౌరుషం' తర్వాత తెలుగులో నేను చేస్తున్న సినిమా ఇదే. ఈ చిత్రాన్ని కూడా తెలుగు, కన్నడలో తెరకెక్కిస్తాం. సైనికుడు సైన్యంలో ఉండాలి. సగటు మనిషి సంఘంలో ఉండాలి అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కే చిత్రమిది. తనీష్‌ డైలాగులు, స్టైల్‌ కొత్తగా ఉంటాయి. సాయికుమార్‌ ప్రత్యేక పాత్రలో నటిస్తారు'' అని చెప్పారు.

నిర్మాత మాట్లాడుతూ ‘‘వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న సినిమా ఇది'' అని అన్నారు. తనీష్‌ మాట్లాడుతూ ‘‘స్టైలిష్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. హీరోగా కన్నా ఆర్టిస్ట్‌గా ఎక్కువ స్కోప్‌ ఉన్న సినిమా. దీన్ని ఓ చాలెంజ్‌గా తీసుకుని చేస్తున్నాను'' అని అన్నారు. మంచి పాత్రల్లో నటిస్తున్నందుకు ఆనందంగా ఉందని మోహిత, అజి జోసెఫ్‌, రాధాకృష్ణ, మిత్ర తదితరులు చెప్పారు.

English summary
Hero Tanish hit the two wheeler with his car at Hyderabad.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu