For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బిగ్‌బాస్ తర్వాత ఫోన్ చేసి నువ్వే మా కొడుకు అంటూ.. నచ్చావులే కోసం రిస్క్ తీసుకున్నా!

  |
  Tanish Emotional Words On Occasion Of Completing 10 Years As Hero | Filmibeat Telugu

  చైల్డ్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకుని హీరోగా మారాడు తనీష్. బిగ్ బాస్ షోతో ఇంకాస్త ఎక్కువ గుర్తింపు పొందాడు. నేటితో తనీష్ హీరోగా మారి 10 ఏళ్ళు పూర్తవుతోంది. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తనీష్ తన సినిమా జీవితాన్ని, కుటుంబ సమస్యలని, బిగ్ బాస్ షో ద్వారా తాను సంపాదించినా గుర్తింపుని వివరించాడు. తాను అంత సులువుగా హీరోగా మారలేదని తనీష్ తెలిపాడు. తనీష్ హీరోగా నటించిన తొలి చిత్రం నచ్చావులే కోసం తాను ఎంతగా కష్టపడ్డానో వివరించాడు.

   చైల్డ్ ఆర్టిస్ట్‌గా జీవితాన్ని ప్రారంభించి

  చైల్డ్ ఆర్టిస్ట్‌గా జీవితాన్ని ప్రారంభించి

  1998లో ప్రేమంటే ఇదేరా చిత్రంతో తాను చైల్డ్ ఆర్టిస్టుగా జీవితాన్ని ప్రారంభించానని తనీష్ తెలిపాడు. 1998నుంచి ఇప్పటి వరకు 20 ఏళ్లుగా నా సినీ జీవితం కొనసాగుతోంది. హీరోగా నేటితో 10 ఏళ్ళు పూర్తయింది. నా చిన్నపుడు మా నాన్న అన్నపూర్ణ స్టూడియోస్ చుట్టూ తిప్పేవారు. ఇవివి సత్యనారాయణ గారి దర్శత్వంలో నాలుగు చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించా అని తెలిపాడు.

  డాన్స్ అంటే ఇష్టం

  డాన్స్ అంటే ఇష్టం

  నాకు చిన్న తనంలోనే డాన్స్ అంటే విపరీతమైన పిచ్చి ఉండేది. మానాన్న డిఫెన్స్ లో పని చేస్తుండడంతో అక్కడ ఎన్నోరకాల ఈవెంట్స్ జరుగుతుండేవి. ప్రతి ఈవెంట్ లో నేను డాన్స్ చేసేవాడిని. నా డాన్స్ చూసి.. మీ కొడుకుని సినిమాల్లో నటింపజేయకూడదూ అని ఎవరో నాన్నకు సలహా ఇచ్చారు. అప్పటి నుంచి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో ప్రయత్నాలు చేసాం అని తనీష్ తెలిపాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా బిజీ అయ్యాక అటు సినిమాలు, ఇటు సీరియల్స్ తో బాగా బిజీ అయిపోయా. రోజుకు మూడు షిఫ్ట్స్ పనిచేసేవాడిని అని తనీష్ తెలిపాడు.

  బిగ్‌బాస్ సెలబ్రిటీ బర్త్ డే.. జోరుగా చిందేసిన రోల్ రైడా, హరిప్రియ.. తనీష్ హంగామా!

  ఎన్నో కష్టాలు

  ఎన్నో కష్టాలు

  నా చిన్నతనంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. నాన్నగారు వాలంటరీ రిటర్మెంట్ తీసుకున్నారు. ఎన్ని కష్టాలు ఉన్నా నాపై మా అమ్మానాన్నకు పూర్తి విశ్వాసం ఉండేది. ఇంటర్ పూర్తి కాగానే హీరోగా నటించాలని డిసైడ్ అయ్యా. సరైన కథ కోసం ఎదురు చూస్తున సమయంలో ఓ అవకాశం వచ్చింది. కానీ అది మంచి కథ కాదు. కానీ హీరో ఆఫర్ కావడంతో కాదనలేకపోయా. మరో కొన్ని రోజుల్లో ఆ చిత్రానికి సైన్ చేయాలి. అలాంటి సమయంలో మిరాకిల్ జరిగిందని తనీష్ తెలిపాడు.

   నచ్చావులే ఆడిషన్స్

  నచ్చావులే ఆడిషన్స్

  నచ్చావులే ఆడిషన్స్ ఆడిషన్స్ జరుగుతుంటే అక్కడికి వెళ్లాను. ఆ చిత్ర దర్శకుడు రవి బాబు సర్ ని చూడగానే భయమేసింది. ఆయన ఆహార్యం, గంభీరమైన స్వరం చూసి కాస్త భయపడ్డా. ఎలాగోలా ఆడిషన్ పూర్తి చేశా. అప్పుడే ఇంటర్మీడియట్ కావడంతో ఇంకా చిన్నపిల్లాడిలానే కాస్త బొద్దుగా కనిపించే వాడిని. రవి బాబు సర్ నన్ను పిలిచి సినిమా ప్రారంభించడానికి 18 రోజుల సమయం ఉంది. ఈ లోపు కాస్త బరువు తగ్గి కనిపిస్తే అప్పుడు చూద్దాం అంటూ సస్పెన్స్ లోకి నెట్టారు.

  రిస్క్ తీసుకున్నా

  రిస్క్ తీసుకున్నా

  లావు తగ్గినా నచ్చావులేలో నటించేది డౌటే. ఇక్కడ మరో సినిమా నా కోసం ఎదురుచూస్తోంది. అలాంటి సమయంలో రిస్క్ తీసుకోక తప్పలేదు. ఇన్ని రోజులు ఎలాగూ కష్టపడ్డాం.. ఇంకొద్ది రోజులు పడదాంఏమవుతుంది అని నాన్న అన్నారు. దీనితో ముందుగా వచ్చిన అవకాశాన్ని పక్కన పెట్టి నచ్చావులే కోసం బరువు తగ్గా. కేవలం 2 వారాల్లోనే 7 కేజీలు తగ్గానని తనీష్ తెలిపాడు.

  నన్ను చూడగానే

  నన్ను చూడగానే

  బరువు తగ్గాక మళ్ళీ వెళ్లి రవిబాబు సర్ కు కనిపించా. నన్ను చూడగానే రేపు వచ్చేయ్. సినిమా ప్రారంభం అవుతుంది అని అన్నారు. నాకు సంతోషపడే సమయం కూడా ఇవ్వకుండా స్వీట్ షాక్ ఇచ్చారు అని తనీష్ తెలిపాడు. ఆ చిత్రం విడుదల కావడం, ఘనవిజయం సాధించడం జరిగింది. తాను రవి బాబు సర్ కి రుణపడి ఉంటానని తనీష్ ఈ సందర్భంగా తెలిపాడు.

  నువ్వే మా కొడుకు

  నువ్వే మా కొడుకు

  ఇక తనీష్ బిగ్ బాస్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయం వెల్లడించాడు. బిగ్ బాస్ ముగిసిన తర్వాత ఓ కార్యక్రమంలో పాల్గొన్నా. ఆ కార్యక్రమంలో తెలియని వ్యక్తులు ఫోన్ చేస్తారు. వారితో మాట్లాడాలి. ఓ మహిళ తిరుపతి నుంచి ఫోన్ చేసి హలో కన్నా అని పిలిచింది. నాకు మా అమ్మ పిలుపులాగే అనిపించింది. మాకు పిల్లలు లేరు. నువ్వే మా కొడుకు అని ఫిక్స్ అయిపోయాం అని చాలా సేపు నాతో మాట్లాడింది. ఇదే తాను బిగ్ బాస్ ద్వారా సంపాదించుకుంది అని తనీష్ తెలిపాడు. బిగ్ బాస్ షోతో నా కుటుంబం మరింత పెద్దదైంది అని తెలిపాడు.

  English summary
  Tanish Speech On Occasion Of Completing 10 Years As Hero. Tanish reveals interesting facts in his Tollywood journey
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X