గమ్మత్తైన టైటిల్ తో పెద్ద వంశీ కొత్త చిత్రం

అజ్మల్, నిఖిత నారాయణ్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ చిత్రానికి 'తను మొన్నే వెళ్లిపోయింది' అనే టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. చక్రి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని పూర్ణ కె నాయుడు నిర్మిస్తున్నారు.
30 ఏళ్లలో వంశీ తీసింది చాలా తక్కువ సినిమాలే అయినా అన్నీ గుర్తుండిపోయే చిత్రాలే. కాగా తన 25వ చిత్రాన్ని ఓ విభిన్నమైన నేపథ్యంలో చేస్తున్నారు దర్శకుడు వంశీ. 'రంగం' ఫేమ్ అజ్మల్ ఇందులో హీరో. నిఖితా నారాయణ్ హీరోయిన్. శ్రీయస్ పతాకంపై పూర్ణానా యుడు ఈ చిత్రా న్ని నిర్మిస్తున్నారు.
నిర్మాత మా ట్లా డుతూ 'వినోదం, సస్పెన్స్ మిళి తమైన ప్రేమకథ ఇది. వంశీ త నదైన శైలిలో దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే సారథీ స్టూడియోలో గ్రీన్ మ్యాట్ బ్యాక్‌గ్రౌం డ్‌లో నాయకా నాయికలపై స్వర్ణ మాస్టర్ నృత్య దర్శకత్వంలో ఓపాట చిత్రీకరించాం. అక్కడ ఒక పాట, కొన్ని సన్నివేశాలు తీస్తాం. ఆ తర్వాత అర కులోయలో ఓ పాట, పతాక సన్ని వేశాలు చిత్రీకరిస్తాం. దాంతో షూ టింగ్ పూర్తవుతుంది. త్వరలో టైటిల్ ప్రకటిస్తాం అని తెలిపారు. ఈ చిత్రా నికి సంగీతం: చక్రి, కెమెరా: ఎం.వి.రఘు, స్క్రిప్ట్ కో-ఆర్డినేటర్: వేమూరి సత్యనారాయణ.


Click it and Unblock the Notifications











