»   »  నానా పాటేకర్ చుట్టు బిగుస్తున్న ఉచ్చు.. రంగంలోకి మహిళా కమిషన్!

నానా పాటేకర్ చుట్టు బిగుస్తున్న ఉచ్చు.. రంగంలోకి మహిళా కమిషన్!

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ప్రముఖ నటుడు నానా పాటేకర్ లైంగికంగా వేధించారని ఆరోపణలు చేస్తూ నటి తనుశ్రీ దత్తా చేసిన ఫిర్యాదుపై మహారాష్ట్ర మహిళా కమిషన్ స్పందించింది. 2008లో హార్న్ ఓకే ప్లీజ్ అనే సినిమా షూటింగ్‌లో తనను చెప్పరాని చోట తాకుతూ, అసభ్యకరమైన నృత్యాలు చేయాలని లైంగికంగా వేధించారని ఇటీవల నానా పాటేకర్‌పై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో నానా పాటేకర్ చుట్టు కేసు వల బిగుసుకొంటున్నట్టు కనిపిస్తున్నది. వివరాల్లోకి వెళితే..

  బాలీవుడ్‌లో తను శ్రీ ప్రకంపనలు

  బాలీవుడ్‌లో తను శ్రీ ప్రకంపనలు

  తను శ్రీ దత్తా ఆరోపణలు బాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తనుశ్రీ దత్తా ఆరోపణల తర్వాత పలువురు తారలు తమకు జరిగిన అన్యాయాన్ని బయటపెడుతున్నారు. ఈ నేపథ్యంలో హర్న్ ఒకే ప్లీజ్ చిత్ర దర్శకుడు రాకేష్ సారంగ్, కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య, నిర్మాత సమీ సిద్ధిఖీ, హీరో నానాపాటేకర్‌కు నోటీసులు జారీ చేసింది.

   నానా పాటేకర్‌కు నోటీసులు

  నానా పాటేకర్‌కు నోటీసులు

  తనుశ్రీ దత్తా ఫిర్యాదు నేపథ్యంలో నలుగురికి నోటీసులు జారీ చేశాం. పది రోజుల్లోగా వాటికి జవాబివ్వాలని ఆదేశించాం అని మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ రహాత్కర్ వెల్లడించారు. అలాగే తనుశ్రీ దత్తా ఫిర్యాదుపై స్పందించిన అవసరమైన చర్యలు తీసుకోవాలని ముంబై పోలీసులకు కూడా నోటీసు పంపామని ఆమె పేర్కొన్నారు.

  తనుశ్రీ దత్తా ఫిర్యాదుపై

  తనుశ్రీ దత్తా ఫిర్యాదుపై

  తనుశ్రీ దత్తా ఫిర్యాదును తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఆమెను స్వయంగా కమిషన్ ముందు హాజరుకావాలని కోరాం. తనుశ్రీ దత్తా ఫిర్యాదులపై నానాతోపాటు మరో ముగ్గురిని తమ వాదనలను వినిపించమని కోరాం. శనివారంలోగా ఎలాంటి దర్యాప్తు, చర్యలు తీసుకొన్నారో శనివారం వెల్లడించాలని ముంబై పోలీసులను కోరాం అని కమిషన్ ఓ వీడియో ప్రకటన చేసింది.

  నిర్మాతలు, మూవీ ఆర్టిస్టులతో

  నిర్మాతలు, మూవీ ఆర్టిస్టులతో

  తను శ్రీ దత్తా ఆరోపణల నేపథ్యంలో సినీ నిర్మాతలను, మీడియా సంస్థలను, సినీ ఆర్టిస్టుల అసోసియేషన్‌తో సంప్రదింపులు జరుపుతున్నాం. బాలీవుడ్‌లో మహిళా నటులు చేస్తున్న ఆరోపణలపై స్పందించడానికి ఓ కమిటీని ఏర్పాటు చేయమని అడిగాం. మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌కు, ప్రొడక్షన్ హౌస్‌లకు లేఖలు రాశాం అని విజయ రహత్కర్ వెల్లడించారు.

  English summary
  Maharashtra Commission for Women issues notices to Nana Patekar, 3 others on Tanushree Dutta’s complaintAfter Tanushree Dutta approached the Maharashtra State Commission for Women, the panel issued notices to Nana Patekar, producer Samee Siddiqui, Ganesh Acharya and director Rakesh Sarang. In her complaint, Tanushree claimed that during the shooting of a song sequence for the film Horn OK Pleassss in 2008, she was being inappropriately touched by Nana even after she had clearly mentioned that she will not enact or perform any lewd, vulgar or uncomfortable steps.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more