For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కళ్లు తిప్పుకోనివ్వని తాప్సీ ఎక్సపోజింగ్ (ఫోటో ఫీచర్)

  By Srikanya
  |

  హైదరాబాద్: హిట్టు, ప్లాప్ లతో సంభదం లేకుండా తమిళ, తెలుగు భాషల్లో దూసుకుపోతున్న తాప్సీ. ఈ ఢిల్లీ బ్యూటీ తన వరస ఆఫర్స్ తో తోటి హీరోయిన్స్ కి ఝలక్ ఇస్తోంది. అంతేగాక తన ఎక్సపోజింగ్ తో అందరినీ తన వైపుకు లాక్కుంటోంది. ఆమెకు హిట్టు ఒకటే తక్కువ కానీ...లేకపోతే నెంబర్ వన్ పొజీషన్ లో ఉండేదంటున్నారు.

  తాజాగా ఆమె వెంకటేశ్ హీరోగా మెహర్ రమేశ్ దర్శకత్వంలో 'షాడో' లో చేస్తోంది. ఎ యూస్క్వేర్ మూవీస్ పతాకంపై పరుచూరి శివరామప్రసాద్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంచిత్రం దాదాపుగా పూర్తయింది. ఇందులో తాప్సీ అందచందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. అందులోని ఫోటోలు మీడియాకు విడుదల చేసారు. అవి ఓ రేంజిలో అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

  ఎంతైనా తాప్సి అదృష్టవంతురాలు. 'మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌' తరవాత చెప్పుకోదగిన విజయం ఆమె ఖాతాలో ఒక్కటీ లేకపోయినా ఆమె పరుగు మాత్రం ఆగలేదు. తెలుగులో అవకాశాలు అందుతూనే ఉన్నాయి. ఏదో ఒక సినిమాలో కనిపిస్తూనే ఉంది. తమిళంలోనూ మెరుస్తోంది. హిందీలో అడుగుపెట్టింది. అయితే అందరికీ ఇలాంటి అవకాశాలు రావు. నటనపరంగా పెద్దగా ఆమెకు మార్కులు లేకపోయినా వరస ఆఫర్స్ వెనక రహస్యం ఏమిటీ అంటే.. గ్లామర్ అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఆ గ్లామర్ ని ఆవిష్కరించిన ఫోటోలు... మీ కోసం

  తాప్సీ హీరోయిన్ గా నటిస్తున్న షాడో చిత్రంలో శ్రీకాంత్ కీలక పాత్రధారి. చిత్రం గురించి దర్శకుడు మెహర్ రమేశ్ మాట్లాడుతూ ' తాప్సీ కెరీర్‌లో చాలా ప్రత్యేకమైన చిత్రమిది. తాప్సీ పాత్రలో కనిపించే షేడ్స్ బాగుంటాయి. అలాగే ఇంట్రడక్షన్ సాంగ్ కూడా అలరిస్తుంది అంటున్నారు.

  షాడో లో... వెంకటేశ్, తాప్సీపై చిత్రీకరించిన సన్నివేశాలు పూర్తి వినోదభరితంగా ఉంటాయి. రక్తపాతాలు లేకుండా చాలా స్టయిలిష్‌గా చిత్రీకరించిన యాక్షన్ సన్నివేశాలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటాయి.

  తాప్సీ తొలి సినిమా నుంచి నటన కన్నా అందాల ఆరబోత కే ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. అందుకే ఝుమ్మందినాదం ప్లాప్ అయినా ఆమెకు డిమాండ్ తగ్గలేదు. కేవలం తాప్సీ కోసం ఆ సినిమా చూడాలనేవాళ్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. తాప్సీ ఎంటర్ అవగానే ఇండస్ట్రీలో అందరి దృష్టిలో పడింది. అయితే ఇప్పుడు తాను రూటు మారుస్తానంటోంది. గుండెల్లో గోదావరి చిత్రంలో తన నటనా విన్యాసాలు చూడమని సవాల్ విసురుతోంది. సినిమా రిలీజ్ అయితేగానీ అది పబ్లిసిటీ స్టంటా లేక తాప్సీ లో నటి నిజంగా ఉందా అనే విషయం నిర్ధారణ కాదు.

  కెరీర్ ప్రారంభం నుంచీ పెద్ద హీరోలతోనే తన ప్రయాణం అన్నట్లుగా ఆచి తూచి అడుగులు వేస్తూ తన డైరీని ఖాళీ లేకుండా బిజీ చేసుకుంటోంది. తమిళ భాషలో సైతం ఆమెకు ఉన్న క్రేజ్ తో రెమ్యునేషన్ లోనూ ఆమె టాప్ స్ధాయిలోనే ఉంది. సరైన హిట్ పడితే నెంబర్ వన్ పొజీషన్ కి ఆమె చేరుకుంటుది.

  ఒక తమిళ చిత్రంతో పాటు తెలుగులో దాదాపు మూడు చిత్రాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారామె. హిందీలో తాప్సీ నటించిన ‘చష్మే బద్దూర్' త్వరలో విడుదల కానుంది. తాప్సీ ముఖంలో కనుపడే అమాయికత్వం ఈ చిత్రానికి ప్లస్ అవుతుందంటున్నాడు.

  ప్రస్తుతం ఆమె తెలుగులో గుండెల్లో గోదారి చిత్రాన్ని పూర్తి చేసింది. ఈ చిత్రం మరందేన్ మనిత్తేన్ పేరుతో తమిళంలోను విడుదల కానుంది.

  గోపిచంద్‌కు జంటగా ఒక యాక్షన్ చిత్రాన్ని చేస్తున్నాను. మరికొన్ని చిత్రాల ఒప్పందాలపై సంతకం చేయాల్సి ఉంది అని చెప్పింది. గోపీచంద్-చంద్రశేఖర్ ఏలేటి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఒక్కడున్నాడు' చిత్రం తర్వాత మళ్లీ అయిదేళ్ల విరామం తీసుకుని వీరిద్దరూ కలిసి పనిచేస్తున్నారు.

  ‘ఛస్మే బద్దూర్' అనే చిత్రంతో బాలీవుడ్‌లోకి కూడా ప్రవేశిసించి అక్కడా సెటిల్ అవ్వాలనే చూస్తోంది. బాలీవుడ్ స్టార్ డైరక్టర్ డేవిడ్ ధావన్ దర్శకత్వంలో రూపొందుతున్న క్లాసిక్ చిత్రం ఛస్మే బద్దూర్ రీమేక్ లో ఎంపికవటం చాలా ఆనందాన్ని ఇస్తోంది అంటోంది. ముగ్గురు అబ్బాయిలు... ఒకమ్మాయి మధ్య జరిగే ఈ తమాషా కథలో కాస్త సెక్సీ లుక్ తో పాటు రెగ్యులర్ హీరోయిన్ కాకూడదని ఆయన భావించి ఆమను ఎంపికచేసారని చెప్తున్నారు.

  పాత్రల ప్రాధాన్యం విషయంలో దర్శకుల్ని తప్పుబట్టడానికి వీల్లేదు. కచ్చితంగా తన సినిమాలో ప్రతి పాత్రనీ ఉన్నతంగానే తీర్చిదిద్దాలనుకొంటారు. కానీ అది ఎల్లవేళలా సాధ్యం కాదు. చాలా విషయాల్లో సర్దుకుపోవల్సి వస్తుంది అని తాప్సీ చెప్తోంది.

  హీరోయిన్ గా ప్రత్యేకమైన లక్ష్యాలేం లేవు. సినిమా ఫలితం బాగా వస్తే... అంతే చాలు. ఈ ప్రయాణంలో నా పాత్ర ప్రాముఖ్యం ఎంత? అనే విషయానికి ప్రాధాన్యం తగ్గింది. ఇది వరకు సినిమా మొత్తం నేనే కనిపించాలి అనుకొనేదాన్ని. ఇప్పుడు ఆ ఆలోచన మారింది. మంచి చిత్రం చేస్తే చక్కటి ఫలితం వస్తుందని గ్రహించాను అంది.

  English summary
  Taapsi Pannu is an Indian model-turned-film actress. She also won Pantaloacons Femina Miss Fresh Face and Safi Femina Miss Beautiful Skin.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X