For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  దర్శకుల్ని తప్పుబట్టడానికి వీల్లేదు: తాప్సి

  By Srikanya
  |

  హైదరాబాద్ :''పాత్రల ప్రాధాన్యం విషయంలో దర్శకుల్ని తప్పుబట్టడానికి వీల్లేదు. కచ్చితంగా తన సినిమాలో ప్రతి పాత్రనీ ఉన్నతంగానే తీర్చిదిద్దాలనుకొంటారు. కానీ అది ఎల్లవేళలా సాధ్యం కాదు. చాలా విషయాల్లో సర్దుకుపోవల్సి వస్తుంది''అని తాప్సీ తెలియచేసింది.
  అలాగే.. హీరోయిన్ గా ప్రత్యేకమైన లక్ష్యాలేం లేవు. సినిమా ఫలితం బాగా వస్తే... అంతే చాలు. ఈ ప్రయాణంలో నా పాత్ర ప్రాముఖ్యం ఎంత? అనే విషయానికి ప్రాధాన్యం తగ్గింది. ఇది వరకు సినిమా మొత్తం నేనే కనిపించాలి అనుకొనేదాన్ని. ఇప్పుడు ఆ ఆలోచన మారింది. మంచి చిత్రం చేస్తే చక్కటి ఫలితం వస్తుందని గ్రహించాను అంది.

  ప్రస్తుతం 'షాడో', 'గుండెల్లో గోదారి' చిత్రాల్లో నటిస్తోంది. 'ఛస్మే బద్దూర్' అనే చిత్రంతో బాలీవుడ్‌లోకి కూడా ప్రవేశిసించి అక్కడా సెటిల్ అవ్వాలనే చూస్తోంది. అంతేకాదు 'డబుల్స్' అనే చిత్రంతో మలయాళ చిత్ర సీమలోకి కూడా అడుగుపెడుతున్నారు తాప్సీ. అందులో మమ్ముట్టి హీరో. బాలీవుడ్ స్టార్ డైరక్టర్ డేవిడ్ ధావన్ దర్శకత్వంలో రూపొందుతున్న క్లాసిక్ చిత్రం ఛస్మే బద్దూర్ రీమేక్ లో ఎంపికవటం చాలా ఆనందాన్ని ఇస్తోంది అంటోంది. ముగ్గురు అబ్బాయిలు...ఒకమ్మాయి మధ్య జరిగే ఈ తమాషా కథలో కాస్త సెక్సీ లుక్ తో పాటు రెగ్యులర్ హీరోయిన్ కాకూడదని ఆయన భావించి ఆమను ఎంపికచేసారని చెప్తున్నారు.

  తాప్సీ ముఖంలో కనుపడే అమాయికత్వం ఈ చిత్రానికి ప్లస్ అవుతుందంటున్నాడు. ఇక తాప్సీ ఈ ఆఫర్ కి పులకించిపోతోంది. హీరోలు ఎవరు అని అడగకుండా వెంటనే కమిటైపోయా అంటోంది. ఎంత ట్రై చేసినా త్రిషకు,ఇలియానా,కాజల్ కు బాలీవుడ్ లో రాని బ్రేక్ ఈమెకు వస్తుందేమో చూడాలి అంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుతం ఆమె తెలుగులో గుండెల్లో గోదారి చిత్రాన్ని పూర్తి చేసింది. ఈ చిత్రం మరందేన్ మనిత్తేన్ పేరుతో తమిళంలోను విడుదల కానుంది.

  అలాగే వెంకటేష్ సరసన షాడో చిత్రంలో నటిస్తున్నాను. గోపిచంద్‌కు జంటగా ఒక యాక్షన్ చిత్రాన్ని చేస్తున్నాను. మరికొన్ని చిత్రాల ఒప్పందాలపై సంతకం చేయాల్సి ఉంది అని చెప్పింది. గోపీచంద్-చంద్రశేఖర్ ఏలేటి కాంబినేషన్‌లో వచ్చిన 'ఒక్కడున్నాడు' చిత్రం తర్వాత మళ్లీ అయిదేళ్ల విరామం తీసుకుని వీరిద్దరూ కలిసి పనిచేస్తున్నారు. బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ తమ శ్రీవెంకటేశ్వర సినీచిత్ర ఇండియా ప్రై.లి. సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

  ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ- ''ఇదొక సాహసంతో కూడుకున్న యాక్షన్ చిత్రం. ప్రపంచదేశాలన్నింటిలో ప్రమాదకరమైనదిగా పరిగణించే ఓ దేశంలో అతివిలువైన ఓ నిధి ఉంటుంది. ఆ నిధిని ఓ సామాన్యుడు ఎలా సాధించాడు అనేది ఈ సినిమా కథాంశం. కథకు తగ్గట్టు జోర్డాన్, రాజస్థాన్, లడక్‌లలో చిత్రీకరణకు ప్లాన్ చేశాం. ఇందులో గోపీచంద్ పాత్ర, ప్రవర్తన భిన్నంగా ఉంటాయి. ఈ ఆధునిక యుగంలో జరిగే ట్రెజర్ హంట్ ప్రేక్షకులను థ్రిల్‌కి గురిచేస్తుంది'' అన్నారు. ఈ చిత్రానికి మాటలు: ప్రశాంత్ అట్లూరి, సుమలత, కెమెరా: శామ్‌దత్, సంగీతం: శ్రీ, సహ నిర్మాత: భోగవల్లి బాపినీడు, సమర్పణ: రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్.

  English summary
  Tapsee busy with four projects. She is happyw with another big movie - Gopichand's new film in the direction of Chandrasekhar Yeleti.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X