»   » పూరీ జగన్నాధ్ చిత్రం ఎందుకు రిజెక్టు చేసానంటే?: తాప్సీ

పూరీ జగన్నాధ్ చిత్రం ఎందుకు రిజెక్టు చేసానంటే?: తాప్సీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో హిందీలో అమితాబ్‌కు జంటగా నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి..అయితే కాల్‌షీట్స్ సమస్య కారణంగా తాను అంగీకరించలేదని తాప్సీ చెప్పింది. అమితాబ్ లాంటి గొప్ప నటుడితో నటించాలనే కోరిక ఏ హీరోయిన్‌కైనా ఉంటుందన్నారు. అలాంటి అవకాశం వచ్చినా వదులుకోవాల్సి రావడం బాధ కలిగించిందని వివరణ ఇచ్చింది. అమితాబ్ తో పూరి రూపొందించనున్న చిత్రం టైటిల్ బుడ్డ. ఆ చిత్రంలో ఆమె సోనూసూద్ సరసన చేయమని అడిగారు. ఇక ఈ బుడ్డ చిత్రం పిబ్రవరి 23వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. అలాగే చిరుత ఫేమ్ నేహాశర్మ కూడా ఈ చిత్రంలో ఓ ప్రధానపాత్ర ఫోషించనుంది. ఇక అమితాబ్ కి జంటగా టబు కనిపించనుంది. ఇంతకు ముందు వీరిద్దరు కాంబినేషన్ లో చీనికామ్ చిత్రం వచ్చి విజయవంతమైంది. ప్రస్తుతం పూరి జగన్నాధ్...రానా, ఇలియానాలు కాంబినేషన్లో "నేను నా రాక్షసి" చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఆ తర్వాత మహేష్, పూరీ కాంబినేషన్ లో ది బిజినెస్ మెన్ చిత్రం రూపొందనుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu