»   » నిర్భయ ఘటన ఎఫెక్ట్: ఆ సీన్లకు తాప్సీ దూరం!

నిర్భయ ఘటన ఎఫెక్ట్: ఆ సీన్లకు తాప్సీ దూరం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ తాప్సీ సినిమాలో ఈ మధ్య హాట్ అండ్ సెక్సీ సన్నివేశాలు పెద్దగా కనిపించడం లేదు. ముద్దు సన్నివేశాలు కూడా చేయడం లేదు. దీనికి కారణం నిర్భయ సంఘటనే అంటున్నారు ఆమె సన్నిహితులు. నిర్భయ ఘటన తర్వాత తాప్సీ తన సినిమాల్లో కొన్ని పరిమితుల్ని, హద్దుల్ని నిర్ణయించుకుందట.

ఇటీవల ఓ హిందీ చిత్రం కోసం తెల్ల చీర ధరించి అండర్ వాటర్‌లో తడిసిన అందాలతో తాప్సీ నటించాల్సి వుందట. అయితే మరీ ఇలాంటి సన్నివేశాల్లో నటించలేనని తాప్సీ ఆ చిత్ర దర్శకుడికి చెప్పేసిందని, అదే సన్నివేశంలో ఎర్ర చీర ధరించి నటించిందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

తాప్సీ మాట్లాడుతూ నిర్భయ సంఘటన నన్నెంతగానో కలిచివేసింది. ఇకపై సినిమాల్లో మితిమీరిన గ్లామర్ సన్నివేశాల్లో....లిప్‌లాక్ సీన్‌లలో నటించకూడదని నిర్ణయించుకున్నాను. హద్దులు మీరనంత వరకు ఎలాంటి పాత్రలో అయినా నటించడానికి నేను ఎప్పుడూ సిద్ధమే కానీ హద్దులు దాటే సన్నివేశాలకు మాత్రం ఇక దూరంగా వుండాలనుకుంటున్నాను అని తెలిపింది.

 Tapsi says NO to bikini and Lip Lock

తాప్సీ ఫైర్...
నిర్భయ హత్యకేసులో దోషిగా శిక్ష అనుభవిస్తున్న ముఖేష్ సింగ్ ఇంటర్వ్యూ వివరాలు ఇటీవల బయటకు వచ్చిన వెంటనే దేశ వ్యాప్తంగా పలువురు మండిపడ్డారు. సినీ సెలబ్రిటీలు ముఖేష్ సింగ్ తీరుపై దుమ్మెత్తి పోసారు. అతన్ని హత్య చేస్తానంటూ తాప్సీ వ్యాఖ్యానించింది.

‘ముఖేష్ ఇంటర్వ్యూ చదివాక ఒక్కసారిగా మాట పడిపోయింది. దేవుడా ఒక్క హత్య చేస్తాను నన్ను క్షమించు, వాడిని ఊరికే వదలకూడదు' అంటూ తాప్సీ తీవ్రంగా స్పందించింది. జైలు శిక్ష నిజంగానే ఈ మగాళ్లను మారుస్తుందా? అనే అనుమానం వస్తోంది. ఆ మార్పు రాకపోతే, ఇంకా వాళ్లు అక్కడ ఎందుకు? అని తాప్సీ ప్రశ్నించింది.

English summary
Actrerss Tapsi says NO to bikini and Lip Lock.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu