»   » ప్రభాస్ ప్రక్కన మగరాయుడులా కనపడతా: తాప్సీ

ప్రభాస్ ప్రక్కన మగరాయుడులా కనపడతా: తాప్సీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

'ఝుమ్మంది నాదం' చిత్రంతో పరిచయమైన తాప్సీ ఇప్పుడు తెలుగులో హాట్ హీరోయిన్ అయిపోయింది. ఇప్పుడామె చేతిలో మూడు చిత్రాలున్నాయి. ప్రస్తుతం ప్రభాస్‌, విష్ణుల చిత్రాల్లో నటిస్తోంది. రవితేజ సినిమాలోనూ హీరోయిన్ గా ఎంపికైంది. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అయిన తాప్సి ఆ చిత్రాల వివరాలు చెబుతూ...విష్ణుతో చేస్తున్న చిత్రంలో హైదరాబాదీ అమ్మాయిలా కనిపిస్తాను. కొత్తదనం నిండిన ప్రేమకథా చిత్రమిది. నవరసాలు ఉన్న సినిమా. ఇక ప్రభాస్‌ సినిమాలో అమెరికాలో పుట్టి పెరిగిన అమ్మాయి పాత్ర నాది. చాలా సరదాగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మగరాయుడిలా ఉంటాను అయినా ముద్దొస్తాను. ఇక రవితేజ పక్కన హీరోయిన్ అంటే మంచి అవకాశమే కదా! సాధారణ తెలుగింటి అమ్మాయిలా నా పాత్ర ఉంటుంది. ముగ్గురూ మాస్‌ హీరోలు కావడం మంచి భవిష్యత్ ఉందనిపిస్తోంది అని ఆశా భావం వ్యక్తం చేస్తోంది తాప్సీ.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu