»   » వివాదాస్పద నటి తారా చౌదరి మళ్లీ వార్తల్లోకి..

వివాదాస్పద నటి తారా చౌదరి మళ్లీ వార్తల్లోకి..

Posted By:
Subscribe to Filmibeat Telugu
Tara Chowdary
గుంటూరు: వ్యభిచార గృహం నడిపిందనే ఆరోపణలపై అరెస్టయిన సినీ నటి తారా చౌదరి మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. తన తమ్ముడిని కొందరు కిడ్నాప్ చేశారంటూ ఆమె గుంటూరు జిల్లా వినుకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మంగళవారం మీడియాలో వార్తలు వచ్చాయి. తన బావతో ఆమె ఓ స్కార్పియో వాహనం విషయంలో ఆమె వివాదంలో చిక్కుకుందని వార్తలు వచ్చాయి.

స్కార్పియో వాహనం తన బావ పేరు మీద ఉన్నా తానే వాయిదాలు చెల్లించానని తారా చౌదరి తెలిపింది. తన బావ వద్ద ఉన్న స్కార్పియో తనదేనని ఆమె పోలీసులకు చేసిన ఫిర్యాదులో ఆమె తెలిపింది. తన ఫిర్యాదును సిఐ బాలసుబ్రహ్మణ్యం పట్టించుకోలేదని ఆమె ఆరోపించారు.

తన తమ్ముడు భాస్కర్‌ను తన బావకు సంబంధించిన మనుషులు కిడ్నాప్ చేశారని ఆమె ఆరోపించింది. కిడ్నాప్‌నకు గురైన తన తమ్ముడి ప్రాణాలకు ముప్పు ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. ఆమె మీడియాతో కూడా మాట్లాడింది.

తన తమ్ముడి ప్రాణాలకు ముప్పు వాటిల్లితే సహించబోనని ఆమె అన్నది. త తమ్ముడు కిడ్నాప్‌నకు గురైనట్లు తారా చౌదరి ఇచ్చిన ఫిర్యాదును తీసుకున్నామని, విచారణ జరిపిస్తామని సిఐ బాలసుబ్రహ్మణ్యం చెప్పారు.

English summary
Controversial film actress Tara Choudhari resurfaced at Vinukonda of Guntur district.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu