»   » హిరణ్యకశ్యప గా ఎన్టీఆర్ :గుణశేఖర్ , సంచలనానికి తెరలేచినట్టే

హిరణ్యకశ్యప గా ఎన్టీఆర్ :గుణశేఖర్ , సంచలనానికి తెరలేచినట్టే

Posted By:
Subscribe to Filmibeat Telugu

రుద్రమదేవి సినిమాతో ఘన విజయం సాధించిన సీనియర్ దర్శకుడు గుణశేఖర్... మరో ప్రయోగానికి రెడీ అవుతున్నాడు. రుద్రమదేవితో భారీ చారిత్రక కథకు తెర రూపం ఇచ్చిన గుణ, ఇప్పుడు ఓ పౌరాణిక కథాంశాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. హిరణ్యకశ్యప పేరుతో ఓ భారీ చిత్రాన్ని రూపొందించే పనిలో ఉన్నాడు. ఈ సినిమాలో అందరికి తెలిసిన భక్త ప్రహ్లాదుడి కథనే హిరణ్య కశ్యపుడి యాంగిల్ లో ప్రెజెంట్ చేయనున్నాడన్న సంగతి కొద్ది రోజుల క్రితమే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

ఫిల్మ్ ఛాంబర్‌లో గుణశేఖర్ హిరణ్యకశ్యప పేరుతో ఓ టైటిల్‌ను రిజిస్టర్ చేయించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పౌరాణిక కథాంశమిదని, భారీ బడ్జెట్‌తో గుణశేఖర్ ఈ చిత్రాన్ని రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారని పరిశ్రమ వర్గాల్లో వినిపిస్తోంది. రుద్రమదేవికి సీక్వెల్‌గా ప్రతాపరుద్రుడు పేరుతో సినిమా చేసే ఆలోచన వుందని గతంలో ప్రకటించారు గుణశేఖర్. అయితే ఈ సీక్వెల్ విషయయై గుణశేఖర్ క్యాంప్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ నేపథ్యంలో గుణశేఖర్ తదుపరి సినిమా ఏమిటనేది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్న సమయం లోనే హిరణ్య కశ్యప ని అనౌన్స్ చేసాడు గుణశేఖర్.

తల్లి గర్భంలో నుంచే విష్ణుభక్తిని జీర్ణించుకుని భక్తాగ్రగణ్యుడుగా ఖ్యాతిగాంచిన భక్త ప్రహ్లాదుడి కథ ఆధారంగా రానున్న 'హిరణ్యకశ్యప' మళ్ళీ ఒక సారి వార్తల్లోకి వచ్చింది. గురువారం ఆయన కాస్ట్యూమ్‌ డిజైనర్‌, తన భార్య శారదతో కలిసి వరాహలక్ష్మీ నృసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం ప్రతినాయక ప్రధాన కథలతో వస్తున్న సినిమాలు ఆదరణ పొందుతున్నాయన్నారు.

Tarak as Hiranyakashyapa for Gunasekhar

ఇందుకు అనుగుణంగా పెద్ద హీరోలు విల నిజం పాత్రల వైపు మొగ్గుచూ పుతున్నారన్నారు. 'రుద్రమదేవి'కి సీక్వెల్‌గా 'ప్రతాప రుద్ర' చిత్రాన్ని నిర్మిస్తామని, రెండు చిత్రాలకు తానే దర్శకత్వం వహిస్తానని తెలిపారు. స్ర్కిప్టులు సిద్ధమయ్యాయని, ముందుగా 'హిరణ్యకశ్యప' సెట్స్‌పైకి వెళ్తుందన్నారు.

కథ నచ్చితే ఇందులో హీరోగా జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటిస్తారని చెప్పటం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. ఎన్టీఆర్ అయితే పౌరాణిక పాత్రను దుమ్ము రేపుతారనటంలో సందేహం లేదు. ఇంతకు ముందు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన యమదొంగ చిత్రంలోనూ యంగ్ యముడుగా పౌరాణిక గెటప్ లో ఎన్టీఆర్ అదరకొట్టాడు. ఎన్టీఆర్ చేస్తే బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ 'హిరణ్యకశ్యప' ట్యాగ్ లైన్ గా ది స్టోరీ ఆఫ్ భక్త ప్రహ్లాద అని పెట్టబోతున్నారట.

English summary
As per the reports, he will take NTR for HIRANYAKASYAPA movie. First, he is going to ask Allu Arjun and NTR. Guna Shekar thought that Jr NTR is perfect for this character.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu