»   » బిగ్‌బాస్ లో మరో ఇద్దరు హీరోయిన్స్: ఎన్టీఆర్‌ కోసమే ఈ ప్రత్యేక ఏర్పాటు చేసారా??

బిగ్‌బాస్ లో మరో ఇద్దరు హీరోయిన్స్: ఎన్టీఆర్‌ కోసమే ఈ ప్రత్యేక ఏర్పాటు చేసారా??

Posted By:
Subscribe to Filmibeat Telugu
Bigg Boss Telugu : Star Heroins Shocking Entry

ఇప్పటి వరకూ వెండితెరపై నట విశ్వరూపం చూపిన ఎన్టీఆర్‌ తొలిసారి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న రియాల్టీ షో 'బిగ్‌బాస్‌'. హిందీలో విశేష ప్రేక్షకాదరణ పొందిన ఈ కార్యక్రమానికి తెలుగులో రూపొందించారుయంగ్ టైగర్' జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా ఉన్న ఈ షో ని తమ సినిమా ప్రమోషన్లకోసం వాడుకున్నాయి కొన్ని సినిమాలు.

నేనే రాజూ నేనే మంత్రి

నేనే రాజూ నేనే మంత్రి

నేనే రాజూ నేనే మంత్రి సమయం లో రానా, ఆనందో బ్రహ్మ సమయం లో తాప్సీ బిగ్ బాస్ హౌస్ లో సందది చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఎన్టీఆర్‌ సినిమా వంతు వచ్చింది అయితీ ఈ సారి హోస్ట్ కాబట్టి జూనియర్ వెళ్ళటానికి అవకాశం లేదు కాబట్టి ఇద్దరు హీరోయిన్ లు బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టారు.

రాశీఖన్నా, నివేదా థామస్ బిగ్‌బాస్‌లో

రాశీఖన్నా, నివేదా థామస్ బిగ్‌బాస్‌లో

యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ రియాల్టీ షోకు ఇద్దరు స్టార్ హీరోయిన్స్ అతిథులుగా వెళ్తున్నారు. సినిమాల ప్రమోషన్స్ కోసం ఇప్పటికే ఎంతో మంది నటీనటులు బిగ్‌బాస్ హౌస్‌కు వెళ్లొచ్చారు. అదే బాటలో ‘జై లవకుశ' హీరోయిన్లు రాశీఖన్నా, నివేదా థామస్ బిగ్‌బాస్‌లోకి వెళ్లారు.


రాశీ ఖన్నా తన ఫేస్బుక్ పేజ్ లో

రాశీ ఖన్నా తన ఫేస్బుక్ పేజ్ లో

శనివారం రాత్రి ప్రసారం అయ్యే ఎపిసోడ్‌లో రాశీఖన్నా, నివేదా థామస్ కనిపిస్తారు. ఈ మేరకు రాశీ ఖన్నా తన ఫ్వేస్బుక్ పేజ్ లో ఒక పోస్ట్ కూడా పెట్టేసింది. శనివారం ఎన్టీఆర్ ఉంటారు కాబట్టి.. రాశీఖన్నా, నివేదా బిగ్‌బాస్‌లోకి వెళ్లడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది.


ఈ నెల 21న విడుదల

ఈ నెల 21న విడుదల

ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన ‘జై లవకుశ' ఈ నెల 21న విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శని, ఆది రెండు రోజులూ బిగ్‌బాస్‌లో ‘జై లవకుశ' ప్రమోషన్స్ ఉండబోతున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ ఎలాగో వ్యాఖ్యతగా ఉండనే ఉన్నారు. ఇక హీరోయిన్స్ కూడా వస్తుండడంతో బుల్లితెర ప్రేక్షకులకు పండగే అని చెప్పాలి.


English summary
As a part of the Jai lavakusha promotions, Rashi Khanna and Nivetha Thomas are entering Bigg Boss sets today.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu