»   » నిబంధనల ఉల్లంఘన: మరో నందమూరి స్టార్ దొరికిపోయాడు!

నిబంధనల ఉల్లంఘన: మరో నందమూరి స్టార్ దొరికిపోయాడు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు నటుడు నందమూరి తారక రత్న నిబంధనలకు విరుద్ధంగా తన కారుకు బ్లాక్ స్టిక్కర్ ఉపయోగించి పోలీసులకు దొరికి పోయారు. జూబ్లీహిల్స్ లోని రోడ్ నెం. 45లో సోమవారం పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తుండగా అదే సమయంలో అటుగా వచ్చిన తారకరత్న కారుకు బ్లాక్ ఫిల్మ్ ఉండటంతో కారు ఆపారు, ఫైన్ వేసారు.

నిబంధనలకు విరుద్ధంగా కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ వాడుతుండటంతో తారకరత్నకు రూ. 700 ఫైన్ వేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కారుకు ఉన్న బ్లాక్ ఫిల్మ్ తొలగించారు. సినీ స్టార్లయినా, మరెవరయినా నిబంధనలు పాటించాల్సిందే అని పోలీసులు తేల్చి చెబుతున్నారు.

Taraka Ratna fined by Cops

ఇటీవల మరో నందమూరి హీరో జూ ఎన్టీఆర్ కారుకు కూడా పోలీసులు ఫైన్ వేసిన సంగతి తెలిసిందే. గతంలోనూ జూ ఎన్టీఆర్ కారుకు పోలీసులు ఇదే విషయమై ఫైన్ విధించారు. ఇప్పటి వరకు మొత్తం 1400 ఫైన్ కట్టినట్లు తెలుస్తోంది. అయితే ప్రతి సారి ఫైన్ కడుతున్నారే తప్ప.... కారుకు ఉన్న బ్లాక్ ఫిల్మ్ మాత్రం తొలగించడం లేదు.

అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన సినీ నటులు ఇలా మళ్లీ మళ్లీ నిబంధనలు ఉల్లంఘించడం ఏమిటనే విమర్శలు వినిపిస్తున్నాయి. కారు అద్దాలకు నల్లటి ఫిల్మ్ (కూలింగ్ ఫిల్మ్) వాటాన్ని మన దేశంలో నిషేదించిన సంగతి తెలిసిందే.

English summary
Taraka Ratna fined by Cops for Having Tinted Glasses on Car.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X