»   » హిందీ చిత్రంలోనూ హీరోగా తారకత్న

హిందీ చిత్రంలోనూ హీరోగా తారకత్న

Posted By:
Subscribe to Filmibeat Telugu

నందమూరి తారకరత్నకి హీరోగా మరో అవకాశం వచ్చింది. 'న్యూ సిమ్‌ కార్డ్‌' అనే హిందీ చిత్రంలో ఈ తారకరత్న హీరోగా బుక్కయ్యారు. మూవీస్థాన్‌ ఎంటర్‌ టైన్ ‌మెంట్స్‌ సంస్థ తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ప్రతిపాటి ప్రసాద్‌, నసీమ్‌ జావేద్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని దర్శకత్వం వహిస్తారు. ఈ చిత్రం షూటింగ్ జులై 9న నుంచి ప్రారంభమవుతుంది. నిర్మాత మోసిమ్‌ ఎమ్‌.రోహి ఈ చిత్ర విశేషాలు మీడియాకు తెలుపుతూ...తెలుగులో ఇదే మా మొదటి చిత్రం. కొత్త తరహాలో ఉంటుంది. హిందీలో 'న్యూ సిమ్‌ కార్డ్‌' అనే పేరు ఖరారు చేశాం. మిగిలిన నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో చెబుతామన్నారు. ఇక రవిబాబు దర్శకత్వంలో వచ్చిన 'అమరావతి' చిత్రంలో తారకరత్న విలన్ చేసారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu