»   » బాలకృష్ణను కాపీ కొడుతున్నాడు

బాలకృష్ణను కాపీ కొడుతున్నాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

వరస ప్లాపుల్లో ఉన్న బాలకృష్ణను సింహా సినిమా గట్టెక్కించింది.ఆ చిత్రంలో మీసకట్టు,గెటప్ ఇప్పుడు తారకరత్న కాపీ కొడుతున్నాడు.అతని తాజా చిత్రం నందీశ్వరుడు కోసం బాలకృష్ణలా స్టిల్స్ ఇచ్చి ఎట్రాక్ట్ చేయాలనుకున్నాడు.బాలకృష్ణతో అనుకున్న టైటిల్ నందిశ్వరుడుని తీసుకోవటమే కాక ఇలా గెటప్ ని కూడా కాపీ కొట్టాలనుకోవటం చాలా చీప్ అంటున్నారు.ఇక ఈ చిత్రానికి దర్శకుడు అంజి శ్రీను.ఆగస్టు 25 న రామానాయుడు స్టూడియోలో లాంచ్ అయ్యింది.ఇక మిగతా నటీనటవర్గం వివరాలు ఇంకా ఫైనల్ కాలేదు.అయితే ఈ చిత్రంలో మరో కీలకపాత్ర జగపతిబాబు చేసే అవకాశముందని తెలుస్తోంది.

ఇక తారకరత్న తో తల పెట్టిన ప్రజాపతి చిత్రం ఏమైందో తెలియదు.దాదాపు ఆగిపోయినట్లే తెలుస్తోంది.చేతిలో ఏ సినిమా లేని జగపతిబాబు ఈ తారకరత్నకు తోడు వచ్చి ఏం సాయిం చేస్తాడంటున్నారు.తనవరకే ఓపినింగ్స్ తెచ్చుకోలేని జగపతిబాబు మరో డిజాస్టర్ హీరోతో మల్టి స్టారర్ బిల్డప్ తో సినిమా చేసినా ఏం ఒరుగుతుంది అంటున్నారు.చక్కగా అమరావతిలో చేసినట్లు తారకరత్న అలాగే విలన్ గా కంటిన్యూ అవటమే మేలు అంటున్నారు.ఇలా తన బాబాయ్ టైటిల్ ,గెటప్ తీసుకుని ఏం చేస్తాడని వినపడుతోంది.

English summary
Taraka Ratna has signed a new film which has been titled as Nandishwarudu. Anji Seenu is going to direct the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu