Don't Miss!
- Automobiles
రిషబ్ పంత్ ప్రాణాలు కాపాడిన వారికి గొప్ప గుర్తింపు.. వీడియో
- News
Ratha saptami 2023: రథసప్తమికి కచ్చితంగా ఈ పనులు చెయ్యండి.. ఆరోగ్యం, అన్నింటా విజయం!!
- Sports
ఆ తప్పిదమే మా ఓటమిని శాసించింది: హార్దిక్ పాండ్యా
- Finance
adani lic: భారీ నష్టాల్లో LIC.. కారణమేంటో తెలుసా..?
- Lifestyle
మీ పార్ట్నర్తో బంధంలోని స్పార్క్ని మేల్కొలపండి, ఇలా బెడ్రూములో హీట్ పెంచండి
- Travel
గురజాడ నడియాడిన నేలపై మనమూ అడుగుపెడదామా!
- Technology
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
సీనియర్ ఎన్టీఆర్ కాంస్య విగ్రహం ఆవిష్కరణ.. అంతా బాలయ్యే అంటూ తారకరత్న కామెంట్స్
దివంగత నటుడు, రాజకీయ వేత్త సీనియర్ ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. సినీ రంగంలో ఎనలేని, చెరగని ముద్ర వేసుకున్నారు. విభిన్నమైన జోనర్లలో నటించి నట సార్వభౌముడిగా ఖ్యాతి పొందారు. పౌరాణిక చిత్రాల్లో నటించడం ఆయన తర్వాతే ఎవరైనా అనేలా తన నటనా కౌశలంతో పాటు అద్భుతమైన దర్శక ప్రతిభను చూపించారు. తెలుగు జాతి గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు. తాజాగా ఆయన విగ్రహాన్ని గుంటూరు జిల్లాలోలని పాలమర్రు పెదనందిపాడులో ఆవిష్కరించారు.

సీనియర్ ఎన్టీఆర్ కాంస్య విగ్రహం..
నందమూరి ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన వారిలో తారకరత్న ఒకరు. అయితే అతను ఎక్కువ కాలం మాత్రం ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేకపోయాడు. ఇక ఇప్పుడు పాలిటిక్స్ లోకి సరికొత్తగా గుర్తింపు అందుకునేందుకు అతను రెడీ అయినట్లుగా తెలుస్తోంది. మొన్నటి తరానికి సినీ కథా నాయకుడిగా.. నిన్నటి తరానికి ప్రజా నాయకుడిగా.. నేటి తరానికి యుగ పురుషునిగా తరతరాలకు తన్మయులను చేసే శక్తి ఉన్న నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా పాలమర్రు పెదనందిపాడులో ఆవిష్కరించారు. డిసెంబర్ 18న మధ్యాహ్నం 12.20 గంటలకు సీనియర్ ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని నటుడు తారకరత్న ఆవిష్కరించాడు. ఈ సందర్భంగా రాజకీయ నాయకుడిగా సీనియర్ ఎన్టీఆర్ చేసిన సేవలను తారకరత్న గుర్తు చేశారు.

ప్రతి ఆడపడుచుకు నేనున్నాంటూ..
నందమూరి తారక రత్న మాట్లాడుతూ.. "1982లో కూడు, గూడు, గుడ్డ అనే నినాదంతో ఆ మహానుభావుడు వేసిన తెలుగుదేశం అనే పునాది ఆ రోజు పేద ప్రజానీకానికి అతి పెద్ద భవంతి అని చెప్పవచ్చు. రెండు రూపాయలకే కిలో బియ్యం అందజేసి దేశానికి వెన్నెముక అయిన రైతన్నకు రామన్నగా నిలిచిన ఏకైక మహానుభావుడు నందమూరి తారకరామారావు గారు. ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా మన తెలుగింటి ఆడపడుచులకు మద్యపాన నిషేధాన్ని అమలు పరుస్తూ.. అన్నా అని పిలిచినా ప్రతి ఆడపడుచుకు నేనున్నా అంటూ పిలుపునిచ్చిన ఏకైక మహానుభావుడు నందమూరి తారక రామారావు. ఈరోజు సంకీర్ణ ప్రభుత్వాలు మన దేశాన్ని పాలించే విధానానికి నాంది పలికింది అంటే అది ఎన్టీఆర్ గారని తెలియజేసుకుంటున్నాను" అని ఆయన తెలిపారు.

రామన్న రాజ్యాన్ని మళ్లీ తీసుకు రావాలని..
ఇంకా ఆయన మాట్లాడుతూ.. ఈరోజు మన దేశాన్ని పాలించేది ఎన్టీఆర్ ఆలోచన, ఎన్టీఆర్ సృజన అని మీ అందరికీ తెలియ జేసుకుంటున్నాను. ఈరోజు ఆయన కళలు కన్న ఆంధ్ర రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. కళ్లారా చూస్తున్నాం.. వింటున్నాం.. మన మాచర్లకు ఏమైందో మీ అందరికీ తెలిసిన విషయమే. మళ్లీ మన భావి తరాల వారు సుఖంగా బతకాలన్నా.. మన రాష్ట్రం భవిష్యత్తు బాగుండాలన్నా.. మనం అందరం కంకణం కట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా గెలిపించుకొని రామన్న రాజ్యాన్ని మళ్లీ తీసుకు రావాలని అందరిని కోరుకుంటూ దానికోసం మనం అందరం ముఖ్యంగా నేను ఈరోజు నుంచి నా అడుగు జనాల వైపు, నా చూపు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి వైపు అని అందరికీ తెలియ జేసుకుంటూ.. ఆ మహానుభావుడికి మనవడిగా, మా బాలయ్య బాబుకి అబ్బాయిగా, మా చంద్రబాబు నాయుడుకి మేనల్లుడుగా, మీ అందరి బిడ్డగా మీ ఆశీర్వదాలే శ్రీ రామ రక్షగా ముందుకు వెళ్లడానికి మీ అందరి ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటున్నాను అని స్పీచ్ ఇచ్చారు నందమూరి తారక రత్న.

అంతా మా బాబాయ్ బాలయ్యే..
అలాగే ఈ కార్యక్రమంలో మాట్లాడిన తారక రత్న.. ఆయనకు అడ్డొస్తే సూర్యుడు, అభిమానిస్తే చంద్రుడిని అని అన్నారు. సూర్యుడైనా, చంద్రుడైనా అంతా మా బాబాయ్ బాలయ్య బాబు అని తెలిపారు. ఆయన సైన్యాధ్యక్షుడైతే, మనమంతా సైనికుల్లా పని చేయాలని కోరారు తారక రత్న. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్ మాకినేని పెద రత్తయ్య, టీడీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు అన్నా బత్తుని జయలక్ష్మీ, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.