»   » హాట్ టాపిక్ : జూ ఎన్టీఆర్‌కి తారకరత్న కౌంటర్ కారణం?

హాట్ టాపిక్ : జూ ఎన్టీఆర్‌కి తారకరత్న కౌంటర్ కారణం?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌ : ఫిల్మ్ సర్కిల్స్ లోనూ, మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు నందమూరి వారసులు జూ. ఎన్టీఆర్, తారకరత్న. ఎన్టీఆర్ అన్నమాటకి తారకరత్న ఇచ్చిన కౌంటర్, దానికి కారణం ఏంటనే విషయమే మాట్లాడుకుంటున్నారు. మహానాడుకు రావాలని తనకు పిలుపు రాలేదని, పార్టీ పిలిస్తే హాజరవుతానని జూనియర్‌ ఎన్టీఆర్‌ తెలిపారు. తారకరత్న ఈ మాటకు కౌంటర్ గా సమాధాన మిచ్చారు.

జూ. ఎన్టీఆర్ అన్న ఆహ్వానంచలేదు అన్న మాటకు ...ఆహ్వానంతో పనేంటి? అని తారకరత్న అన్నారు. మహానాడుకు తనకు ఆహ్వానం అందలేదన్న జూనియర్‌ ఎన్టీఆర్‌ వ్యాఖ్యలపై సినీ నటుడు తారకరత్నలు స్పందించారు. తారకరత్న మంగళవారం మహానాడులో కొంతసేపు గడిపారు. మీడియా అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు.

జూనియర్‌ ఎన్టీఆర్‌కు ఆహ్వానం అందలేదట కదా! అన్న ప్రశ్నకు.. ''ఈరోజు ఎన్టీఆర్‌ జయంతి. ఆ సందర్భంగానే మహానాడు నిర్వహిస్తున్నారు. ఇది నందమూరి కుటుంబ పండగ. దీనికి ఆహ్వానంతో పనేంటి? ఇది అంతా హాజరుకావాల్సిన కార్యక్రమం. పార్టీకి నందమూరి కుటుంబం ఎప్పుడూ అండగా ఉండాలి'' అని బదులిచ్చారు.

గతంలోనూ ఎన్టీఆర్ గా తన పేరుని మార్చుకునే ప్రయత్నం నందీశ్వరుడు చిత్రంతో చేసారు తారకరత్న. అయితే ఆ సినిమా విజయవంతం కాకపోవటంతో ఆ పేరుతో ఆయన పాపులర్ కాలేదు. మొదటినుంచి ఆయన ఎన్టీఆర్ తో పోటీ పడాలనే ప్రయత్నం కనపడుతోందని అంటున్నారు.

మరోవైపు నందమూరి బాలకృష్ణకు కూడా ఆహ్వానం పంపలేదని, తండ్రి జయంతి కార్యక్రమం సందర్భంగా మహానాడుకు ఆయనే రావడం ఆనవాయితీ అని, ఈసారీ అలాగే వచ్చారని పార్టీ వర్గాలు తెలిపాయి.

ఇక ఎన్టీఆర్ ..తనను ఆహ్వానిస్తే రానున్న ఎన్నికల్లోనూ ప్రచారమూ చేస్తానని తెలిపారు. తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ జయంతి కార్యక్రమం మంగళవారం సచివాలయం సమీపంలోని ఎన్టీఆర్‌ఘాట్‌లో జరిగింది. ఉదయాన్నే తొలుత జూనియర్‌ ఎన్టీఆర్‌ దంపతులు అక్కడికి చేరుకుని నివాళులు అర్పించారు. తాతగారు పెట్టిన ఈ పార్టీ 2014లో విజయం సాధిస్తుందన్నారు.

English summary
Nandamuri hero Tarakaratna has differed with Jr NTR statement made regarding invitation to the Telugudesam party Mahanadu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu