»   »  వెంకటాద్రి గట్టెక్కిస్తుందా?

వెంకటాద్రి గట్టెక్కిస్తుందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

వరుసగా తొమ్మిది సినిమాలలో హీరోగా నటించనున్నాడని తొలి సినిమా షూటింగ్ ప్రారంభోత్సవంనాడే ప్రకటించి సంచలనం సృష్టించిన హీరో తారకరత్న. అందులో మూడు సినిమాలు నిర్మితమయినా బ్రేక్ రాలేదు తారకరత్నకు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా హీరోగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు తారకరత్న. తాజాగా ఆయన హీరోగా రూపొందుతున్న చిత్రం వెంకటాద్రి. ఈ సినిమాను రామకృష్ణ సినీ స్టూడియోస్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ చిత్రంలో మన్ దీప్ టక్కర్ హీరోయిన్ గా చేస్తోంది. సముద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో పొన్నాంబళం, దళపతి దినేష్, రవి, లాంబర్ట్, ధర్మవరపు సుబ్రహమణ్యం, వేణుమాధవ్, శివకృష్ణ తదితరులు నటిస్తున్నారు. సెప్టెంబర్ 23న ప్రారంభమయిన ఈ చిత్ర షూటింగ్ తొలి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది.

Read more about: taraka ratna venkatadri
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X