twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తుడిచి పెట్టే స్థాయిలో తారకరత్న సినిమా

    By Srikanya
    |

    'ఈ సినిమా ఘనవిజయంతో మా హీరో తారకరత్నగారి దశ, దిశ మారుతుంది. ఆయన గత వైఫల్యాలను తుడిచి పెట్టే స్థాయిలో ఈ సినిమా విజయాన్ని సొంతం చేసుకుంటుంది' అని ధీమా వ్యక్తం చేస్తున్నారు 'నందీశ్వరుడు' దర్శకుడు శ్రీను యరజాల. నందమూరి తారకరత్న హీరోగా కోట ఫిలిం కార్పొరేషన్, ఎస్.ఆర్.బి.ఆర్ట్ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న 'నందీశ్వరుడు' చిత్రం యాభై శాతానికి పైగా పూర్తయింది. ఈ సినిమాలో మరో ప్రముఖ హీరో కూడా నటిస్తున్నట్లు నిర్మాతలు సేగు రమేష్‌బాబు, కోట గంగాధర రెడ్డి చెప్పారు. శరవేగంతో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోందని, నవంబర్‌లో ఏడు దేశాల్లో సినిమాలోని ఏడు పాటలను చిత్రీకరిస్తామని తెలిపారు.ఇక ఆ ప్రముఖ హీరో మరెవరో కాదు బాలకృష్ణ అని తెలుస్తోంది.

    ఇక కన్నడంలో సూపర్ హిట్టయిన 'డెడ్లీ సోమా' అనే సినిమా ఆధారంతో ఆగస్ట్ 25నే ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా మొదలైంది. అప్పుడు దర్శకుడు మాట్లాడుతూ... 'నందీశ్వరుడు' టైటిల్ ఇచ్చిన పెద్దలకు థాంక్స్. 'డెడ్లీ సోమా' అనే కన్నడ ఈసినిమాలో లైన్‌ను మాత్రం తీసుకున్నాం. తారకరత్న పాత్రతో పాటు షీనా పాత్ర కూడా హైలైట్‌గా ఉంటుంది అని చెప్పాడు. ఈ 'ఎన్టీఆర్" ఓ విభిన్నమైన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో ఆయన సరసన షీనా కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా గురించి నిర్మాతలు మాట్లాడుతూ -''ఎలాంటి అవాంతరాలు లేకుండా, అందరి సహకారంతో అత్యంత భారీగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. వచ్చే నెలాఖరుకు టాకీని పూర్తి చేసి, నవంబరులో పాటల చిత్రీకరణ మొదలుపెడతాం. సందర్భానుగుణంగా ఇందులో ఏడు పాటలుంటాయి. ఆ ఏడు పాటలను ఏడు దేశాల్లో చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నాం అని తెలిపారు.

    రచయితలు పరుచూరి బ్రదర్స్ మాట్లాడుతూ -''కన్నడంలో సూపర్‌హిట్ అయిన 'డెడ్లీ సోమా" ఆధారంగా రూపొందుతోన్న చిత్రమిది. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు చిత్రాలకు రచన చేస్తున్నప్పుడు మేం ఎంత భావోద్వేగానికి లోనయ్యామో ఈ 'నందీశ్వరుడు"కి పనిచేసేటప్పుడు కూడా అలాంటి అనుభూతినే పొందాం. ఇందులో తారకరత్న నట విశ్వరూపం చూస్తారు""అని చెప్పారు. మంచి టీమ్‌తో పనిచేయడం తన అదృష్టమని, ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్న సంగీత దర్శకుడు పార్థు గొప్ప సంగీత దర్శకుడిగా ఎదుగుతాడని దర్శకుడు అన్నారు. 'బిందాస్' కథానాయిక షీనా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సుమన్, సీత, రాజీవ్ కనకాల, జీవి, అజయ్, చలపతిరావు, డైరెక్టర్ శరత్, నాగినీడు, ఢిల్లీ రాజేశ్వరి, ప్రభాస్ శ్రీను, నందన్ గౌడ్ ఇతర ముఖ్య తారాగణం. ఈ చిత్రానికి రచన: పరుచూరి బ్రదర్స్, ఫొటోగ్రఫీ: సుధాకరరెడ్డి, సంగీతం: పార్థు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బి.ఇంద్రసేనారెడ్డి (యువరాజ్).

    English summary
    Nandamuri Tarakaratna recently changed his name as NTR. After delivering a series of flops, he is coming up with a very powerful movie named 'Nandeeswarudu'.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X