»   » బాలయ్య టైటిల్ తీసుకున్న అబ్బాయ్

బాలయ్య టైటిల్ తీసుకున్న అబ్బాయ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

నందమూరి హీరోల్లో ఒకరైన తారకరత్న 'నందీశ్వరుడు" అనే సినిమాకు సైన్ చేశారు. గతంలో ఇదే టైటిల్ పై ప్రముఖ దర్శకుడు బి. గోపాల్.. బాలయ్య హీరోగా సినిమా తీయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు సంబంధించి అప్పట్లో ప్రకటన కూడా వెలువడింది. అయితే బి.గోపాల్ దాని పేరును 'హర హర మహాదేవ"గా మార్చడంతో....బాలయ్య టైటిల్ పై కన్నేసిన అతని అన్న కొడుకైన తారకరత్న నందీశ్వరుడు టైటిల్ దక్కించుకున్నాడు.

తారక్ 'నందీశ్వరుడు" సినిమాకు అంజి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. చిత్ర నిర్మాతలు రామానాయుడు స్టూడియోలో సినిమాను లాంచ్ చేయడానికి ప్లాన్ చేశారు. సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు, టెక్సీషియన్స్ గురించిన వివరాలు తెలియాల్సి ఉంది. అమరావతి సినిమాకు గాను నంది అవార్డు అందుకున్న తారకరత్న మరోసారి వెండి తెరపై తన సత్తా చాటాలనే పట్టుదలతో ఉన్నారు.

English summary
Nandamuri Tarakaratna has signed up a new film titled as Nandiswaradu. The title has been earlier considered for Bala Krsihna’s film in the direction of B.Gopal which was later changed to Hara Hara Mahadeva. So, Tarakaratna will soon reach the big-screens as Nadiswarudu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu