»   » షూటింగులో ప్రమాదం: తారకరత్నకు గాయాలు

షూటింగులో ప్రమాదం: తారకరత్నకు గాయాలు

Posted By:
Subscribe to Filmibeat Telugu
Tarakaratna
హైదరాబాద్: నందమూరి హీరో తారకరత్న సినిమా షూటింగులో గాయపడ్డాడు. 'ఎదురులేని అలెంగ్జాడర్' అనే సినిమా షూటింగులో ఆయన గాయపడినట్లు సమాచారం. హైదరాబాద్‌లోని నానక్‌రాంగుడాలోని లెదర్ ఫ్యాక్టరీలో షూటింగ్ జరుగుతుండగా ప్రమాదవశాత్తు మంటలు అంటున్నట్లు తెలుస్తోంది. ఈ మంటలు అంటుకుని తారకరత్న గాయపడినట్లు చెబుతున్నారు. ఆయనను వెంటనే అపోలో ఆస్పత్రికి తరలించారు. తారకరత్న ప్రముఖ హీరో బాలకృష్ణ సోదరుని కుమారుడు.

తారక రత్న నటిస్తున్న 'ఎదురు లేని అలెగ్జాండర్' చిత్రం షూటింగ్‌కు నవంబర్ చివరివారంలో హైదరాబాద్ శివారులోని రాజేంద్రనగర్ ఏరియా శంకర్ పల్లిలో విఘాతం కలిగింది. ముందస్తు అనుమతి లేకుండా షూటింగ్ జరుపుతుండటంతో పోలీసులు అడ్డుకున్నారు. షూటింగుల సమయంలో అనుమతి తప్పని సరని, తమ విధి నిర్వహణలో భాగంగానే సినిమాను అడ్డుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

'ఎదురులేని అలెగ్జాండర్' చిత్రం ఇటీవలే రామానాయుడు స్టూడియోలో ప్రారంభోత్సవం జరుపుకుంది. పోచా సాహితి ధనుష్ రెడ్డి సమర్పణలో పి.ఎల్.కె.రెడ్డి నిర్మిస్తున్న ఈచిత్రంలో కుంకుమ్ అనే కొత్త హీరోయిన్ పరిచయం అవుతోంది. ఈ చిత్రంలో తారకరత్న పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు.

ఈ చిత్రంలో తారకరత్న, కుంకుమ్ తో పాటు రవిబాబు, విజయ్, ఉదయ్ తేజ, ఎ.వి.ఎస్, కొండవలస, రామకృష్ణ, సురేష్ తదితరులు నటిస్తున్నారు. ఈచిత్రానికి మాటలు: చింతా శ్రీనివాస్, పాటలు: రామ జోగయ్య శాస్త్రి, చింతా శ్రీనివాస్, ఆర్ట్: భాస్కర్, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ: తోట రమణ, సంగీతం: జోష్యభట్ల శర్మ.

English summary
Nandamuri hero Tarakaratna has been injured in a fir accident during the shooting of his film Eduruleni Alexandar.
Please Wait while comments are loading...