»   » మహేష్ బాబు మల్టీప్లెక్స్ ఇంద్రలోకమే: తరణ్ ఆదర్శ్ ఫిదా (ఫోటోస్)

మహేష్ బాబు మల్టీప్లెక్స్ ఇంద్రలోకమే: తరణ్ ఆదర్శ్ ఫిదా (ఫోటోస్)

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Taran Adarsh Tweeted On Mahesh Babu's Multiplex | Filmibeat Telugu

  మహేష్ బాబు, ఏసియన్ సినిమాస్ కలిసి నిర్మించిన 'ఎఎంబి సినిమాస్' (ఏసియన్ మహేష్ బాబు సినిమాస్) ఆదివారం గ్రాండ్‌గా లాంచ్ అయిన సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ చేతుల మీదుగా ఈ మల్టీప్లెక్స్ ప్రారంభించారు.

  7 స్క్రీన్లు, 1638 సీటింగ్ కెపాసిటీతో ఉన్న ఈ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవానికి ప్రముఖ సినీ వ్యాపార విశ్లేషకుడు, క్రిటిక్ తరణ్ ఆదర్శ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన 'ఎఎంబి సినిమాస్' నిర్మించిన తీరు చూసి ఆశ్చర్యపోయారు. ఇందులోకి వెళితే ఇంద్రలోకంలోకి వెళ్లినట్లు ఉందనే భావన వ్యక్తం చేశారు.

  ఫోటోస్ షేర్ చేసిన తరణ్

  ఎఎంబి సినిమాస్ ప్రారంభోత్సవం సినీ ప్రముఖుల ఆధ్వర్యంలో కన్నుల పండుగలా జరిగిందని... టెక్నాలజీ, ఇంటీరియర్ డిజైనింగ్ కలగలిపి ఎంతో అద్భుతంగా దీన్ని నిర్మించారని తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మహేష్ బాబు, నమ్రతతో కలిసి దిగిన ఫోటోస్ అభిమానులతో పంచుకున్నారు.

  ఇంద్రలోకంలా ఉంది

  ప్రముఖ ఆర్కిటెక్ట్ ఎరానా యెక్బోట్ దీన్ని డిజైన్ చేశారని, ఈ మల్టీప్లెక్స్ చూస్తుంటే ఇంద్రభవనంలా ఉందంటూ తరణ్ ఆదర్శ్ ప్రశంసలు గుప్పించారు.

  ప్రతి థియేటర్ డిఫరెంటుగా

  ఈ మల్టీ ప్లెక్స్‌లో ప్రతి స్క్రీన్, అందులోని సీటింగ్ డిఫరెంటుగా ఉన్నాయని... ఇందులో సినిమా చూడటం అంటే వరల్డ్ క్లాస్ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ పొందడమే అంటున్నారు తరణ్.

  మహేష్ బాబు, నమ్రతకు థాంక్స్

  ‘ఎఎంబి సినిమాస్' ప్రారంభోత్సవ వేడుకకు తనను ప్రత్యేకంగా ఆహ్వానించడంపై మహేష్ బాబు, నమ్రత, నారంగ్స్‌కు ఆయన ప్రత్యేక థన్యవాదాలు తెలియజేశారు.

  English summary
  "Had a tour of the 7-screen Superplex, AMB Cinemas [Asian Mahesh Babu Cinemas], with renowned architect Eranna Yekbote, before the formal inauguration... Must add, the 7-screen Superplex is breathtakingly beautiful. Special thanks to Mahesh Babu, his wonderful wife Namrata and the Narangs for being wonderful hosts... #AMBCinemas urstrulyMahesh amb_cinemas." Taran Aadarsh tweeted.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more