»   » ‘అత్తారింటికి దారేది’పై...హాలీవుడ్ కంపెనీల కన్ను

‘అత్తారింటికి దారేది’పై...హాలీవుడ్ కంపెనీల కన్ను

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రం కలెక్షన్లు బాలీవుడ్ వర్గాలను సైతం ఆశ్చర్య పరుస్తున్నాయి. ప్రముఖ బాలీవుడ్ వాణిజ్య విశ్లేషకులు తరణ్ ఆదర్శ్ మాట్లాడుతూ.....అత్తారింటికి దారేది కలెక్షన్లు ఆశ్చర్యానికి, షాక్‌కు గురిచేసేలా ఉన్నాయని వ్యాఖ్యానించారు.

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 'తన ఎంటైర్ కెరీర్లోనే ఎప్పుడూ 'అత్తారింటికి దారేది' సినిమాకు వచ్చినటువంటి షాకింగ్ కలెక్షన్లు చూడలేదని, ఇండియన్ సినిమా చరిత్రలోనే తొలిసారిగా హాలీవుడ్ సినిమా కంపెనీలు సైతం 'అత్తారింటికి దారేది' సినిమా కలెక్షన్లను పరిశీలిస్తున్నాయి అని నాతో తరణ్ ఆదర్శ్ చెప్పారు' అని రామ్ గోపాల్ వర్మ వెల్లడించారు.

Taran Adarsh shocked with AD Collection

'అత్తారింటికి దారేది' చిత్రం ఓవర్సీస్‌ మార్కెట్లో కురిపిస్తున్న కలెక్షన్ల వర్షాన్ని చూసి....తరణ్ ఆదర్శ్ ఈ వ్యాఖ్యలు చేసారు. 'అత్తారింటికి దారేది' చిత్రం ఓవర్సీస్ మార్కెట్లో వారం గడవకముందే 2 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఈ రేంజిలో కలెక్షన్లు రావడం ఇండియన్ సినీ చరిత్రలో ఇదే తొలిసారి.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా స్టార్ రైటర్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి.పతాకంపై భారీ చిత్రాల నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్'అత్తారింటికి దారేది' చిత్రాన్ని నిర్మించారు. పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు.

నదియా, కోట శ్రీనివాస్, అలీ, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ తదితరులు నటించారు. ఈచిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్: రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.

English summary

 Ram Gopal Varma make some interesting statements on Attarintiki Daredi. “Taran adarsh told me that in his entire career he has not been more shocked with any films collections more than Attarintiki daaredi. For the first time in indian film history I am told hollywood film companies are tracking the telugu film Attarintiki Daaredi collection”, he said.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu