»   » 'బాహుబలి‌' హిందీ వెర్షన్ :కలెక్షన్స్ ఇప్పటికి ఎంత

'బాహుబలి‌' హిందీ వెర్షన్ :కలెక్షన్స్ ఇప్పటికి ఎంత

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై‌:భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన టాలీవుడ్‌ చిత్రం 'బాహుబలి-ద బిగినింగ్‌' భారీ రికార్డులను కూడా సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అదేవిదంగా హిందీ వెర్షన్ సైతం కలెక్షన్స్ లో రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకుపోతోంది. ఈ చిత్రం విడుదలై మూడు వారాలు పూర్తయినా ఇప్పటికీ కలెక్షన్‌ల మోత మోగిస్తూనే ఉంది.

బాలీవుడ్‌లో ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటి వరకూ హిందీలో డబ్బింగ్‌ అయిన చిత్రాలు ఏవీ అందుకోలేని స్థాయికి బాహుబలి చేరింది. హిందీలో ఈ సినిమా ఇప్పటి వరకూ రూ.85.71 కోట్లు వసూలు చేసినట్లు బాలీవుడ్‌ విశ్లేషకులు తరణ్‌ ఆదర్శ్‌ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా వెల్లడించారు. ఆయనేం అన్నారో ఆయన ట్వీట్ ద్వారా చూడండి.ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


చిత్రం కలెక్షన్స్ విషయానికి వస్తే...


ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్‌, రానా, తమన్నా, అనుష్క ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది.
రూ.100కోట్లు.. 200.. 300.. కోట్లు దాటిపోయింది. ప్రస్తుతం బాహుబలి ప్రపంచ వ్యాప్తంగా రూ.355కోట్లు వసూలు చేసినట్లు అంచనా. ఇంకేముంది రూ.500కోట్ల కలెక్షన్‌ సినిమాలో జాబితాలో చేరేందుకు దూసుకెళ్తోంది.


అంతేకాదు బాలీవుడ్‌లో అధిక వసూళ్లు సాధించిన సినిమాలతో పోటీ పడుతోంది. జులై 17న విడుదలైన బాలీవుడ్‌ సినిమా 'భజరంగీ భాయీజాన్‌' ప్రపంచవ్యాప్తంగా రూ.226కోట్లు వసూలు చేసి ప్రస్తుతం బాహుబలికి గట్టి పోటీ ఇస్తోంది.


taran adarsh ‏tweets on baahubali movie collections

ఇక బాహుబలి సినిమా విడుదలైన తొలి రోజు నుంచే రికార్డులు బద్ధలు కొడుతూనే ఉంది. జులై 10 శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన బాహుబలి ఒక్క రోజే ప్రపంచ వ్యాప్తంగా రూ.68కోట్ల షేర్‌ వసూలు చేసి ఆశ్చర్యానికి గురిచేసింది. ఇది భారతీయ చిత్ర పరిశ్రమ రికార్డుగా చెప్తున్నారు.


బాలీవుడ్‌లో షారూక్‌ ఖాన్‌ నటించిన 'హ్యాపీ న్యూ ఇయర్‌' సినిమా తొలి రోజు రూ.65కోట్ల షేర్‌ సాధించినట్లు సమాచారం. దీంతో బాలీవుడ్‌ తొలిరోజు రికార్డులను బద్ధలు కొట్టేసింది.


English summary
taran adarsh ‏tweeted: "Baahubali [dubbed Hindi version; Week 3] is simply UNSTOPPABLE. Fri 3.10 cr, Sat 4.35 cr, Sun 5.11 cr. Total: ₹ 85.71 cr. FANTABULOUS!"
Please Wait while comments are loading...