»   »  తరుణ్- ఇలియానాల సిన్మా ఆడియో

తరుణ్- ఇలియానాల సిన్మా ఆడియో

Posted By:
Subscribe to Filmibeat Telugu
Ileana
ఇలియానా, తరుణ్ నటించిన "భలే దొంగలు" ఆడియో నేడు గురువారం విడుదలైంది. ఈ సినిమా కోసం చార్మి మీద ఐటం సాంగ్ ను చిత్రిస్తున్న సెట్ లోనే ఆడియో విడుదల్ ఉత్సవం జరగడం విశేషం. హీరో వెంకటేష్ అల్బమ్ ను విడుదల చేసి, తొలి సిడిని రవితేజకు బహూకరించారు.

ఈ సినిమాలో ప్రత్యేక పాత్ర పోషించిన జగపతి బాబు సహా నటీనటులందరూ ఆడియో విడుదల్ ఉత్సవంలో పాల్గొన్నారు. విజయ భాస్కర్ దర్శకత్వంలో మళ్ళీ నటిస్తున్నందుకు సంతోషంగా ఉందని హీరో తరుణ్ చెప్పాడు. సూపర్ హిట్ చిత్రం "నువ్వే కావాలి" తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో ఈ చిత్రం వస్తోంది. ఈ సినిమాలో తాను తొలిసారిగా ఐటం సాంగ్ చేశానని, ఈ అనుభూతి మరువలేనిదని చార్మి చెప్పింది. శాఖమూరి పాండురంగారావు, బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం కె ఎం రాధాకృష్ణ

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X